షాకింగ్.. రేప్ కేసులో కుంభమేళా మోనాలిసా డైరెక్టర్.. పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో..?
ఈరోజుల్లో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో కూడా తెలియడం లేదు. ఒక్క రాత్రిలోనే జీవితాలు మారిపోతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారు అని చెప్పడం కష్టం.

ఈరోజుల్లో ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో కూడా తెలియడం లేదు. ఒక్క రాత్రిలోనే జీవితాలు మారిపోతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారు అని చెప్పడం కష్టం. కావాలంటే మోనాలిసాను తీసుకోండి.. మహా కుంభమేళలో పూసలు అమ్ముకునే ఈ అమ్మాయిని రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసింది సోషల్ మీడియా. ఒక మూడు నాలుగు రోజులపాటు దేశం మొత్తం ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంది. అంత ఫేమస్ కావడంతో బాలీవుడ్ దర్శకులు ఊరుకోరు కదా.. పిలిచి మరి తమ సినిమాలలో అవకాశం ఇస్తాము అని చెప్తారు. అలా మోనాలిసాను హీరోయిన్ గా పెట్టి సనోజ్ మిశ్రా అనే దర్శకుడు సినిమా తీస్తానని అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు ఆమెకు కొన్ని లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ దర్శకుడితో పాటే కనిపిస్తూ వస్తుంది మోనాలిసా. ఇదంతా అయ్యే పని కాదు.. అమ్మాయికి ఉన్న క్రేజ్ వాడుకోవడానికి ఆ దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అనవసరంగా అతడిని నమ్మి మోనాలిసా తన జీవితం నాశనం చేసుకుంటుందన్న వాళ్ళు కూడా లేకపోలేదు.
ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నదే అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే మోనాలిసా తో సినిమా చేస్తాను అని అనౌన్స్ చేసిన సనోజ్ మిశ్రామి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈయన ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. దానికి కారణం ఆయన మీద రేప్ కేసు నమోదు అవ్వడమే. గతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను హీరోయిన్ గా, అవకాశం ఇస్తాను అని నమ్మించి ఆమె మీద చాలాసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు అనేది సనోజ్ మిశ్రామి మీద ఉన్న అభియోగం. అంతేకాదు తాము ఇద్దరం క్లోజ్ గా ఉన్నప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఆరా తీస్తే.. ఝాన్సీ అనే ప్రాంతం నుంచి వచ్చిన ఒక అమ్మాయిని 2020లో సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసుకొని.. తను ఒక డైరెక్టర్ అని చెప్పి.. 2021 జూన్ 17న తాను ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నాను తనను కలవడానికి రావాలని మిశ్రా తనకు ఫోన్ చేసి చెప్పినట్టు పోలీసులకు చెప్పింది ఆ అమ్మాయి.
రాకపోతే తను చచ్చిపోతాను అంటూ బెదిరించాడని.. దాంతో వెళ్లి కలిస్తే తనకు మత్తుమందు ఇచ్చే అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ సనోజ్ మిశ్రాపై కేసు పెట్టింది ఆ అమ్మాయి. అలా ఒక్కసారి కాదు బెదిరించి, వీడియోలు తీసి ఎన్నోసార్లు తరుణ్ లైంగికంగా వేధించాడు అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటాను అని, తన సినిమాలలో హీరోయిన్ గా అవకాశం ఇస్తాను అని చెప్పి వాడుకున్నాడు అంటూ పోలీసులకు చెప్పుకొచ్చింది. ఇక మిశ్రా విషయానికి వస్తే.. గాంధీ గిరి, రామ్ కి జన్మభూమి, లఫంగే నవాబ్, కాశీ టు కాశ్మీర్ లాంటి సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం మోనాలిసాను హీరోయిన్ చేస్తాను అంటూ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు ఆమెను ముంబైలోని ఒక యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ చేసినట్టు తెలుస్తోంది. ఈలోపే సనోజ్ మీశ్రాపై రేప్ కేసు నమోదు కావడంతో.. మోనాలిసా పరిస్థితి ఏంటి అంటూ అందరూ ఆరా తీస్తున్నారు.