Kurchi Madathapetti song: కుర్చీ మడతపెట్టి పాటకు యమ క్రేజ్.. 200 మిలియన్ ప్లస్ వ్యూస్
ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటి వరకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సాంగ్ పెద్ద మైల్ స్టోన్‌ని రీచ్ అయిందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Kurchi Madathapetti song: సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం సాంగ్ ఇప్పుడు సెన్సేషన్‌గా మారుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల కలిసి స్టెప్పులేసిన ‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటి వరకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
Pushpa2 : వెయ్యి కోట్లతో ‘పుష్ప 2’ సంచలనం
దీంతో ఈ సాంగ్ పెద్ద మైల్ స్టోన్‌ని రీచ్ అయిందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అరె.. మహేష్ బాబు క్రేజ్ ఏంటి ఆ సాంగ్ ఏంటి అంటూ, గుంటూరు కారం కుర్చీ మడతబెట్టి సాంగ్ ప్రోమో బయటికి రాగానే తెగ ఫైర్ అయిపోయారు నెటిజన్స్. తమన్‌ను కాస్త గట్టిగానే ట్రోల్ చేశారు. కానీ.. అసలు మ్యాటర్ సాంగ్‌లో ఉందంటూ.. ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్ పై స్టార్టింగ్‌లో కాస్త నెగెటివిటీ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ఓ ఊపు ఊపేసింది. తమన్ ట్యూన్.. మహేష్ బాబు, శ్రీలీల డ్యాన్స్‌తో థియేటర్లో కుర్చీ మడతపెట్టేశారు ఆడియెన్స్. ఈ వీడియో సాంగ్ వచ్చిన కొన్ని నెలల్లోనే 100 మిలియన్ వ్యూస్ కొట్టేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్‌గా మరో రికార్డు మైల్ స్టోన్ 200 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసింది.
దీంతో ఈ సాంగ్ హవా ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క తెలుగులోనే కాదు.. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా ఈ సాంగ్ సూపర్ రీచ్ అందుకుంది. అయితే.. గుంటూరు కారం సినిమా మాత్రం ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ సాటిస్ఫై కాలేకపోయారు. అందుకే.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి రంగంలోకి దిగిపోయారు. ఏదేమైనా.. కుర్చీ మడతబెట్టి సాంగ్ మాత్రం ఇంకా రికార్డులు మడతబెడుతునే ఉంది.