17 ఏళ్ళ తర్వాత ప్రభాస్ తో లేడీ సూపర్ స్టార్, స్పెషల్ సాంగ్

ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతూ భారీ బడ్జెట్ సినిమాలను ఓ లెక్కతో చేస్తున్నాడు. ఇండియాలో టాప్ నిర్మాణ సంస్థలు అన్నీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 12:48 PMLast Updated on: Dec 07, 2024 | 12:48 PM

Lady Superstar Special Song With Prabhas After 17 Years

ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతూ భారీ బడ్జెట్ సినిమాలను ఓ లెక్కతో చేస్తున్నాడు. ఇండియాలో టాప్ నిర్మాణ సంస్థలు అన్నీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాయి. హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో మూడు సినిమాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 550 కోట్లు ప్రభాస్ కు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఆ రేంజ్ లో తీసుకోలేదు. 2025 నుంచి ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి.

ఇవి కాకుండా ది రాజాసాబ్, స్పిరిట్, కల్కీ 2, ఫౌజీ వంటి వేరే ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో పెట్టాడు. ది రాజాసాబ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నట్టు టాక్. ఈ నెలలోనే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ది రాజా సాబ్ కోసం మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ముందు ప్రభాస్ లుక్ ఆడియన్స్ కు పిచ్చి లేపుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేయించారు మేకర్స్.

ఇప్పటి వరకు ఆ రేంజ్ లో ఏ సినిమాకు సెట్ వేయలేదని నిర్మాతలు ప్రకటించడం చూసాం. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు ప్రభాస్ సరసన యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ తర్వాతి ప్రాజెక్ట్ లు లైన్ లో ఉండటంతో మారుతీ అసలు లేట్ చేయడం లేదు. అందుకే వీలైనంత ఫాస్ట్ గా సినిమా షూట్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఒకటి గ్రాండ్ గా ప్లాన్ చేసారు. తమిళ మార్కెట్ పై సీరియస్ ఫోకస్ తో ఓ సాంగ్ ను రెడీ చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి నయనతార ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయనుంది. చంద్రబోస్ రాసిన ఆ పాటకు ఆమెను ఫైనల్ చేసారు. ఇందుకోసం నయన్ కు ఆరు కోట్లు పే చేస్తున్నారు నిర్మాతలు. ఈ మంత్ ఎండ్ లో ఈ పాటను షూట్ ఫినిష్ చేస్తారు మేకర్స్. ఆమెతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కూడా స్టెప్స్ వేయనుంది. తమిళంలో నయన్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సాంగ్ ను ప్లాన్ చేసినట్టు టాక్. 2007లో వచ్చిన ‘యోగి’ సినిమాలో ప్రభాస్, నయనతారతో కలిసి నటించాడు. అ తర్వాత మళ్ళీ వీళ్ళు సినిమా చేయలేదు. వీరిద్దరూ మళ్ళీ 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ ను షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.