లేడీ విలన్.. ప్రియాంకా చోప్రా హీరోయిన్ కాదు, రాజమౌళి వైల్డ్ ప్లాన్

మహేష్ బాబు, రాజమౌళి సినిమా అనగానే ఆ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ జనాలకు ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటి నుంచే ఎదురు చూడటం మొదలుపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 12:46 PMLast Updated on: Feb 06, 2025 | 12:46 PM

Lady Villain Priyanka Chopra Is Not The Heroine Rajamoulis Wild Plan

మహేష్ బాబు, రాజమౌళి సినిమా అనగానే ఆ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ జనాలకు ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పటి నుంచే ఎదురు చూడటం మొదలుపెట్టారు. లేటెస్ట్ గా సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ముందుగానే స్టార్ట్ అవ్వటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, త్వరలో కెన్యాలో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇప్పటికే హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసిన రాజమౌళి, హీరోయిన్ ఎంట్రీ సీన్ కెన్యాలోని నేషనల్ పార్క్ లో ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో జరిగే షూటింగ్ లో ప్రియాంక చోప్రా అవసరం లేకపోవడంతో ఆమె ముంబై వెళ్ళిపోయింది అని, డైరెక్ట్ గా కెన్యా వెళ్లి మూవీ టీం తో కలిసే ఛాన్స్ ఉందని టాక్. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ నా లేదంటే, ఆమెది నెగిటివ్ రోలా అనేది మాత్రం క్లారిటీ రావటం లేదు. ప్రస్తుతం వస్తున్న న్యూస్ ప్రకారం ఆమెది కచ్చితంగా నెగిటివ్ రోల్ అనే టాక్ వినబడుతుంది.

ప్రియాంక చోప్రా కు హాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉండటంతో, ఆమె పాత్రకు వెయిట్ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కచ్చితంగా ఆమెది నెగిటివ్ రోల్ అని టాక్. సినిమాలో హీరోయిన్ తో రొమాన్స్ సీన్లు ఉండవు అంటున్నారు జనాలు. బాహుబలి సినిమా తర్వాత నుంచి రాజమౌళి కాస్త ట్రెండ్ మార్చాడు. హీరోయిన్లతో పెద్దగా రొమాన్స్ సీన్లు గాని లవ్ సీన్స్ కానీ లేకుండానే ప్లాన్ చేస్తున్నాడు. ఉన్నా సరే డీసెంట్ సీన్స్ తో సినిమా నెట్టుకు వస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే ప్లాన్ చేసినట్లు టాక్.

ఇక ప్రియాంక చోప్రా ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్లు వసూలు చేస్తుందని టాక్. ఆమె రెండేళ్లపాటు ఈ సినిమా కోసమే టైం కేటాయించింది అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోగా, త్వరలోనే ఒక క్రేజీ అప్డేట్ కూడా ఈ సినిమా గురించి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు రాజమౌళి ఒక వీడియోతో బయటపెట్టాడు. ప్రస్తుతం హైదరాబాదులో జరిగే షూటింగ్లో మహేష్ బాబు కూడా పాల్గొంటున్నాడు. అయితే ఇది ఎంట్రీ సీన్ అని వార్తలు వస్తున్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చేయడాది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ టైం తీసుకోకుండా 2028 నాటికి ఈ సినిమాను కంప్లీట్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు.