లైలా రివ్యూ; ప్రమోషన్ హిట్ సినిమా ఫట్
ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్.. లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో..ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసాడు.

ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్.. లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసాడు. సినిమా కోసం లేడీ గెటప్ లో కూడా కనిపించి అలరించాడు. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’ వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమాను కాంట్రవర్సీలు కూడా అలాగే ఇబ్బంది పెట్టాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
సోను మోడల్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ ఓనర్. సోను మేకప్ స్కిల్స్ కు అక్కడ మంచి జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఒక కస్టమర్ కుటుంబానికి హెల్ప్ చేయాలని.. ఆమె భర్త నడిపే వంటనూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్‌గా తన పేరు వాడుకోమని చెప్తాడు. కాని ఈ నిర్ణయం సోనుని ఇబ్బందులపాలు చేస్తుంది. ఆ తర్వాత సోను ఎలా లైలాగా మారాడు, ఆ తర్వాత పడిన కష్టాలు ఏంటీ అనేది కథ. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో బాగున్నా… యాక్షన్ కు స్కోప్ తక్కువగా ఉంది. కాని నటన పరంగా తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు.
ఈ సినిమాకు అతని నటన మాత్రమే ప్లస్ పాయింట్. ఇక ఆకాంక్ష శర్మ గ్లామర్ షో కూడా బాగానే ఉంది. అభిమన్యు సింగ్ పాత్రకు మంచి వెయిట్ ఉంది. బబ్లు పృథ్వీరాజ్, వినీత్ కుమార్ లాంటి పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు. సోషల్ మీడియాలో హడావుడి చేసే సునీషిత్ తన నిజ జీవితం పాత్రనే ఈ సినిమాలో పోషించినా అది కామెడీగా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఫ్లాప్ అనే చెప్పాలి. ‘ఇచ్చుకుందాం బేబీ’ పాట మినహా గొప్పగా ఏం లేదనే చెప్పాలి.
కథలో పట్టు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది. విశ్వక్ నటన సినిమాకు ప్లస్ అయింది. ఇక కొన్ని కామెడి సీన్స్ కూడా బాగున్నాయి. కథలో పట్టు లేకపోయినా సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు. లాగ్ బాగా ఉండటం, పాటలు కూడా ఆకట్టుకోకపోవడం మైనస్ అనే చెప్పాలి. ‘హిట్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి సినిమాలతో యాక్షన్ పరంగా తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. కాని ప్రయోగాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సినిమా కూడా అలాగే ఇబ్బంది పెట్టింది. అతని ఎనర్జీ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్. కథతో సంబంధం లేకుండా అర్ధం లేని కామెడి కూడా చిరాకుగా ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులకు వెయిట్ ఎక్కువగా ఇచ్చారు. హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అసలు బాగాలేదు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కాస్త ఓకే అయినా సెకండ్ ఆఫ్ మాత్రం గొప్పగా లేదు. క్లైమాక్స్ ఓకే ఓకే..