Vijay : విజయ్ లాస్ట్ మూవీపై లేటెస్ట్ బజ్
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్‌కు (Vijay Dhalapathy) ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ స్టార్ హీరో (Star Hero) త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా (68th Movie) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest Of All Time) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Latest buzz on Vijay's last movie
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్‌కు (Vijay Dhalapathy) ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ స్టార్ హీరో (Star Hero) త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా (68th Movie) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest Of All Time) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలు చేసి 70 సినిమాలతో ఆపాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరో ప్రక్క 69వ సినిమానే లాస్ట్ సినిమా అవ్వొచ్చు అని కూడా అంటున్నారు. దీంతో.. విజయ్ కెరీర్‌లో లాస్ట్ మూవీగా భావిస్తున్న 69వ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీపై వినిపిస్తోన్న ఓ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయ్ 69వ సినిమా ఏంటి..? ఎవరితో అనే క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి సినిమా కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకోసం చాలా మంది డైరక్టర్స్ ని అనుకున్నారు. మన తెలుగు సహా తమిళ్ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఓ టైమ్ లో తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అదిరిపోయే కథను రెడీ చేశారని వార్తలు వచ్చాయి. గోపీచంద్ మలినేని పేరు కూడా వైరల్ అయ్యింది. కానీ.. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ గా మాత్రం ఓ దర్శకుడు పేరే వినిపిస్తుంది. అతడే హెచ్ వినోద్.
“ఖాకీ”, “వలిమై”, “తెగింపు” లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన తాను విజయ్ చివరి సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు అని కోలీవుడ్ వర్గాల్లో ఇపుడు గట్టిగా వినిపిస్తుంది. రీసెంట్ గా హెచ్ వినోద్… ఓ కథను విజయ్ కి వినిపించగా ఆయనకు బాగా నచ్చిందట ఆ కథ. వెంటనే ఒకే చెప్పేశాడట. పొలిటికల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారట.. చూడాలి మరి.. విజయ్ కెరీర్‌లో లాస్ట్ మూవీని డైరెక్ట్ చేయబోయే గోల్డెన్ ఛాన్స్‌ని దక్కించుకోబోయే లక్కీ డైరెక్టర్ ఎవరో..