venu swami : నవ్వుతున్న నెటిజన్లు.. మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..
వేణు స్వామి (Venu Swamy).. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.. సెలెబ్రిటీ హోదా ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు (famous astrologer).. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లు, పొలిటికల్ లీడర్లకు (Political Leaders) జాతకాలు చెప్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

Laughing netizens.. angry Prabhas fans..
వేణు స్వామి (Venu Swamy).. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.. సెలెబ్రిటీ హోదా ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు (famous astrologer).. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లు, పొలిటికల్ లీడర్లకు (Political Leaders) జాతకాలు చెప్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాను చెప్పే జాతకాల కంటే కూడా కంటే వాటి వల్ల క్రియేట్ అయ్యే కాంట్రవర్సీస్ వల్లే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కొందరు సెలబ్రిటీస్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజం కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగిందనడంలో సందేహం లేదు. రీసెంట్ టైమ్ లో మాత్రం ఎక్కువగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు వేణు స్వామి.. దీంతో.. డార్లింగ్ అభిమానులు, వేణు స్వామికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే వచ్చింది. ఇలాంటి టైమ్‌లో వేణు స్వామికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భార్యతో కలిసి ప్రభాస్ డైలాగ్ (Prabhas Dailar) తో రీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్‌ను ఇమిటేట్ చేస్తూ వేణు స్వామి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘మిర్చి’ (Mirchi) సినిమాలోని ప్రభాస్ – అనుష్క శెట్టి (Anushka Shetty) మధ్య సాగే ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేణుస్వామి కూడా భార్యతో అదే సీన్ ను ఫన్నీగా చేశారు. ఆ వీడియో ప్రభాస్ వాయిస్ ను ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోలో వేణు స్వామి తన లుక్కుని మార్చేసి మోడల్గా మారిపోయారు. తన భార్యతో కలిసి చేసిన ఈ రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటూ వేణు స్వామి పలికిన డైలాగ్‌కు వీణా శ్రీవాణి చిలిపిగా ఇచ్చిన కౌంటర్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్సాన్స్ వస్తోంది.. వేణుస్వామి మోడ్రన్ లుక్ చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు. ఆయనలో ఈ కళ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. వేణు స్వామి తీరుపై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఎప్పుడు ప్రభాస్ పై ట్రోల్స్ చేసే ఈయన ఇలా రీల్స్ చెయ్యడం పై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పేరు ఎత్తకుండా వేణుస్వామి బతకలేడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
View this post on Instagram