Lavanya Varun: మిస్టర్ సినిమాతో కాదు.. లావణ్య, వరుణ్ లవ్ ఎలా మొదలైందో తెలుసా..
మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. చాలా కాలం నుంచి వీళ్ల గురించి వస్తున్న రూమర్స్‌ను ఇజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.
జూన్ 9న వరుణ్, లావణ్య కుటుంబ సభ్యలు మధ్య చాలా సింపుల్‌గా వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఈ పెయిర్ ఇప్పటి వరకూ రెండు సినిమాలు కలిసి చేశారు. మిస్టర్ సినిమాతో మొదటిసారి, అంతరిక్షం సినిమాతో రెండోసారి స్క్రీన్ మీద జంటగా కనిపించారు. మిస్టర్ సినిమా షూట్ చేస్తున్న టైంలోనే వీళ్ల మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందని అంతా చెప్తుంటారు. కానీ అసలు కథ వేరే ఉందట. వరున్ తేజ్ ఫిట్‌నెస్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో లావణ్య కూడా వర్కౌట్స్‌కు అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది.
హైదరాబాద్‌లో వీళ్లిద్దరూ వెళ్లే జిమ్ ఒక్కటే. అక్కడే వీళ్లిద్దరికీ ఫస్ట్ పరిచయం ఏర్పడిందట. వీళ్లిద్దరు ఎక్కువ క్లోజ్ అయ్యింది కూడా జిమ్‌లోనే అని వాళ్లిద్దరి కామన్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఆ తరువాత మిస్టర్ సినిమా ఓకే అవడంతో ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఫ్రెండ్‌షిప్‌గా ఉన్న వాళ్ల రిలేషన్ ప్రేమగా మారిందట. అప్పటి నుంచి స్క్రీన్ మీదే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా వరుణ్‌కి లావణ్య హీరోయిన్ ఐపోయింది.
ఆ తరువాత వచ్చిన అంతరిక్షం సినిమాలో వీళ్ల మధ్య కనిపించిన ఎమోషన్ అంతా ఇంతా కాదు. పార్టీలు, ఫంక్షన్లు అంటూ కొన్ని ప్రైవేట్ ప్లేసెస్‌లో కూడా కనిపించడంతో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ మొదలైంది. రీసెంట్‌గా అయితే పెళ్లి చేసుకున్నారని కూడా గాసిప్స్ వచ్చాయి. లావణ్య కొన్ని సార్లు ఈ రూమర్స్ అన్నీ ఫేక్ అని క్లారిటీ ఇచ్చినా.. రూమర్స్ మాత్రం ఆగలేదు. కానీ చివరికి ఆ రూమర్సే నిజమయ్యాయి. అంతా అనుకున్నట్టే ఫైనల్‌గా ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీళ్ల లవ్ స్టోరీ తెలిసి ఇద్దరి ఫ్యాన్స్ ఇప్పుడు త్రిల్ అవుతున్నారు. వీళ్లిద్దరి ఒరిజినల్ లవ్‌స్టోరీతోనే ఓ సినిమా తీయోచ్చు కదా అంటున్నారు.