దేవర గుండెల్లో రాయి… లీక్స్ భయం మొదలైంది…
దైవర సినిమాపై ఉన్న అంచనాలే ఇప్పుడు ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దైవర సినిమాపై ఉన్న అంచనాలే ఇప్పుడు ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో భయం పెరిగిపోతుంది. ఎప్పుడు విడుదల అవుతుందా అని చూసే పరిస్థితి నుంచి సమయం దగ్గర పడుతున్న కొద్దీ భయపడే వరకూ పరిస్థితి వచ్చిందనే మాట వాస్తవం. నెగటివ్ ప్రచారం దెబ్బ ఫ్యాన్స్ ని మరింత కంగారు పెడుతుంది. ట్రైలర్ ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో ఫ్యాన్స్ భయం బాగా పెరిగింది అనే మాట వాస్తవం. సినిమా కాపీ అనే మాట కూడా ఇప్పుడు ఎక్కువగానే వినపడుతోంది. ఈ సమయంలో హైప్ పెంచడానికి ఎన్టీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నాడు.
ఇప్పుడు మరో వార్త ఫ్యాన్స్ ను భయపెడుతోంది. దేవర నుంచి లీక్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ బయటకు వచ్చాయనే వార్తలు కంగారు పెడుతున్నాయి. కొరటాల శివను వ్యతిరేకించే ఒక వర్గం సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ ని ఫోన్లో షూట్ చేసారట. సినిమా విడుదలకు ముందు ఆ సీన్స్ ని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారనే ఆందోళన చిత్ర యూనిట్ లో ఉంది. సినిమాకు ముందు పని చేసిన కొందరు సినిమా ఎడిటింగ్ సమయంలో ఫోన్లో రికార్డ్ చేసి ఇప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తున్నారట. ఇక దేవరకు భారీ హైప్ ఉండటంతో సినిమా పైరసీ అయ్యే అవకాశం ఉందనే భయం అభిమానుల్లో ఉంది.
అసలే సినిమా నెగటివ్ ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక చిత్ర యూనిట్ కంగారు పడుతున్న సమయంలో ఈ లీక్స్ వ్యవహారం మరింత తలనొప్పి అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ నెల 27 న విడుదల అవుతున్న ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.