Game Changer : గేమ్ ఛేంజర్‌ను వదలని లీకులు..
గ్లోబల్ స్టార్ (Glober Star) రామ్ చరణ్ (Ram Charan) హీరో.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer).. ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది..

Leaks to release game changer..
గ్లోబల్ స్టార్ (Glober Star) రామ్ చరణ్ (Ram Charan) హీరో.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer).. ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది.. ట్రిపుల్ ఆర్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లుగానే నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish)అన్ కాంప్రమైజ్డ్‌గా అంచనాలకు ధీటుగా గేమ్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీని మొదటి నుంచీ లీకుల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకు వచ్చి వైరల్‌గా మారాయి.
రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సెట్స్ నుంచి కొన్ని పిక్స్‌ను ఎవరో లీక్ చేశారు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా గేమ్ ఛేంజర్ నుండి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్‌గా.. క్రీం కలర్ షార్ట్ బ్లాక్ ప్యాంటులో ఇన్ షర్ట్ ధరించి ఉన్న రామ్ చరణ్ పలు పిక్స్ లీక్ అయ్యాయి. అయితే.. ఈ లీకులరాయుళ్లపై చెర్రీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లీక్స్‌కి ఇకనైనా గేమ్ ఛేంజర్ టీమ్ అడ్డుకట్ట వేయాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక… గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ చెర్రీ సినిమాని లీకులు వదలడం లేదు.. అప్పుడు లీక్ అయిన జరగండి సాంగ్ చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటని పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.