Ali Khan, Trisha : తమిళ నటుడు అలీ ఖాన్ ను వదిలేయండి.. నటి త్రిష.
మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ.. త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే.. నడిగర్ సంఘం సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఎన్నిబెదిరింపులు వచ్చిన.. ఎన్ని సవాళ్లు వచ్చిన నటుడు అలీ ఖాన్ ఏమాత్రం బెదరకుండా త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటు తెల్చిచేప్పేసాడు. ఇదే వివాదం పై చట్టపరమైన చర్యలు.. చుట్టుముడుతూ ఉండడంతో మన్సూర్ దిగువచ్చి త్రిషకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. తన సహ నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి అంటూ మాన్సూర్ అలీ ఖాన్ తమిళంలో తెలియజేయడం ఆ ప్రకటనలో ఉంది.
ఇటివలే తమిళంలో సీనియర్ నటుడుగా పేరుపొందిన మన్సూర్ అలీ ఖాన్.. హీరోయిన్ త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హీరోయిన్ త్రిష కు అటు రాజకీయంగా ఇటు.. సినీ పరిశ్రమ నుంచి మద్దతు భారీగానే లభిస్తోంది. కోలీవుడే కాకుండా.. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది నటులు ఆమెకు సపోర్టుగా మట్లాడారు. త్రిష మీద చేసిన వ్యాఖ్యల పట్ల మన్సూర్ అలీ ఖాన్ పలుచోట్ల పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా మానస పోలీసుల ఎదుట కూడా హాజరయ్యారు. మరొకవైపు జాతీయ మహిళా కమిషన్ నుండి కూడా మన్సూర్ అలీ ఖాన్ పైన పోలీస్ కేసు నమోదు అయ్యింది.
మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ.. త్రిష కు క్షమాపణలు చెప్పకపోతే.. నడిగర్ సంఘం సభ్యత్వం సైతం రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. ఎన్నిబెదిరింపులు వచ్చిన.. ఎన్ని సవాళ్లు వచ్చిన నటుడు అలీ ఖాన్ ఏమాత్రం బెదరకుండా త్రిషకు క్షమాపణలు చెప్పేదే లేదంటు తెల్చిచేప్పేసాడు. ఇదే వివాదం పై చట్టపరమైన చర్యలు.. చుట్టుముడుతూ ఉండడంతో మన్సూర్ దిగువచ్చి త్రిషకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పినట్లుగా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రముఖ జర్నలిస్ట్ రమేష్ బాల తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. తన సహ నటి త్రిష దయచేసి నన్ను క్షమించండి అంటూ మాన్సూర్ అలీ ఖాన్ తమిళంలో తెలియజేయడం ఆ ప్రకటనలో ఉంది.
కాగా తాజాగా అలీఖాన్ పై త్రిష పోలిసులకు ఓ లేఖ రాసింది. అలీఖాన్ వదిలేయండి.. మన్నూర్ అలీఖాన్ జరిగిన వివాదంపై నాకు క్షమాపణలు చెప్పారు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హీరోయిన్ త్రిష.. చెన్నై పోలీసులకు లేఖ రాసింది.