Bollywood, Heroine Janhvi Kapoor : జాహ్నవి పూజలు ఎవరికోసం?
ప్రియుడితో కలిసి పబ్బుల్లో.. పార్టీల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జాన్వీ కపూర్ రూటు మార్చింది. మార్చింది. ఈసారి లవర్ తో గుడికెళ్లి భజన చేసింది. కోరుకున్న ప్రియుడితో పెళ్లి అవ్వాలని కోరుకుందాం? పెళ్లెప్పుడంటూ.. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాన్వీ, మాజీ కేంద్రమంత్రి షియాజీ షిండే మనవుడు శిఖర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. శ్రీదేవి బతికున్న రోజుల్లోనే ఈ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. జాన్వీ సినిమాల్లోకి రాకముందే.. ప్రేమలో విహరించింది.
ప్రియుడితో కలిసి పబ్బుల్లో.. పార్టీల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జాన్వీ కపూర్ రూటు మార్చింది. మార్చింది. ఈసారి లవర్ తో గుడికెళ్లి భజన చేసింది. కోరుకున్న ప్రియుడితో పెళ్లి అవ్వాలని కోరుకుందాం? పెళ్లెప్పుడంటూ.. నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాన్వీ, మాజీ కేంద్రమంత్రి షియాజీ షిండే మనవుడు శిఖర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. శ్రీదేవి బతికున్న రోజుల్లోనే ఈ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. జాన్వీ సినిమాల్లోకి రాకముందే.. ప్రేమలో విహరించింది. ఈ విషయంలో శ్రీదేవికి తెలిసి ముందు కెరీర్.. ఆ తర్వాతే పెళ్లి అంటూ నచ్చచెప్పడం.. ఈలోగా ఆమె చనిపోవడంతో.. లవ్ ఎఫైర్ బ్రేకప్ అయిందనుకున్నారు. గ్యాప్ తర్వాత మళ్లీ చేయి చేయి కలిపి తిరగడం స్టార్ట్ చేశారు. బోనీ కపూర్ ఆశీస్సులు పుష్కలంగా వుండడంతో.. గతంలో ప్రియుడు.. ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వచ్చింది జాన్వీ.
Dunki : డుంకీ ఫట్ అవుతుందా? అందుకే హిందీ కి లిమిట్ చేశార?
ఈ లవర్స్ గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. లేటెస్ట్గా మధ్యప్రదేశ్ ఉజ్జెన్లోని మహాకాళేశ్వర్ టెంపుల్‌కు వెళ్లి భజన చేశారు. ఇలా వరుసపెట్టి గుళ్లకు కూడా తిరగడంతో.. పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటారేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జాన్వీ ఎక్కడకు వెళ్లినా.. ప్రియుడు శిఖర్ వుండాల్సిందే. ఆమధ్య అంబానీ కల్చర్ ఈవెంట్లో కలిసి వెళ్లారు. వీళ్లిద్దరూ డీప్ లవ్ లో వున్నా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ తక్కువే. దేవరలో ఎన్టీఆర్ తో జత కడుతూ.. క్రేజీ ఇమేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు దాటినా రాని క్రేజ్ దేవర తీసుకొచ్చింది. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే.. కెరీర్‌కు బ్రేకులు పడతాయన్న భయం జాన్వీకి లేకపోలేదు.