Miss Universe : మిస్ యూనివర్స్‌గా నికరాగ్వా బ్యూటీ
ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మిస్ యూనివర్స్ పోటీలు చాలా కలర్‌ఫుల్‌గా జరిగాయి. ఎల్ సాల్వెడార్ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 84 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని నికరాగ్వా భామ గెలుచుకుంది. 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ నికరాగ్వా.. షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచింది.

Like every year, this year also the Miss Universe pageant was very colorful. Nicaraguan beauty as Miss Universe
ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మిస్ యూనివర్స్ పోటీలు చాలా కలర్‌ఫుల్‌గా జరిగాయి. ఎల్ సాల్వెడార్ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 84 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని నికరాగ్వా భామ గెలుచుకుంది. 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిస్ నికరాగ్వా.. షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా గెలిచిన ఆర్ బానీ గాబ్రియేల్ ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. అన్ని రౌండ్లు అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన షెన్నిస్ ఆఖరి రౌండ్‌లో కూడా అదరగొట్టింది. జీవితంలో ఎవరిని మార్గదర్శిగా ఎంచుకుంటారని జడ్జెస్ అడిగిన ప్రశ్నకు.. 18వ శతాబ్దపు బ్రిటిష్ తత్వవేత్త, స్త్రీవాది మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ అని చెప్పింది షెన్నిస్. ‘ఆమె సరిహద్దులను ఉల్లంఘించి చాలా మంది మహిళలకు అవకాశం ఇచ్చింది.. ఈ రోజు మహిళలకు ఎటువంటి పరిమితులు లేవు’ అని చెప్పింది.
ICC WORLD CRICKET CUP: ఇండియా శుభారంభం…. !
ఇక మొదటి రన్నరప్‌గా మిస్ థాయలాండ్ అన్నోటియా పోర్సిల్డ్, సెకండ్ రన్నరప్‌గా మిస్ ఆస్ట్రేలియా మోరాయ విల్సన్‌లు నిలిచారు. భారత్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. సెమీ-ఫైనల్స్‌లో ఆమె టాప్-20లో ఒకరిగా ఉంది. 2012 మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో, మెనౌనోస్, జెన్నీ మై వరుసగా రెండోసారి టోర్నమెంట్‌ను హోస్ట్ చేశారు. జ్యూరీ హాల్, 2018 మిస్ యూనివర్స్ క్యాథ్రినా గ్రే కరస్పాండెంట్ పాత్రను చేపట్టారు. ఇక, మిస్ యూనివర్స్ పోటీల్లో మొదటిసారి వివాహితతో పాటు పిల్లలున్న మహిళలకు అవకాశం కల్పించారు. 1957లో ఈ పోటీలు ప్రారంభమైన తర్వాత వివాహితలు పాల్గొనడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ మొదటిసారిగా ఈ పోటీలకు తమ దేశం తరఫున ప్రతినిధిని పంపింది.డెన్మార్క్, ఈజిప్టు, గునియా, హంగేరి, ఐర్లాండ్, కజకిస్తాన్, లాట్వియా, మంగోలియా, నార్వే, జింబాబ్వే ఈ ఏడాది రీ-ఎంట్రీ ఇచ్చాయి.