Lokesh Kanagaraj: లియో కోసం ఏడుకొండలెక్కిన లోకేష్ కనకరాజ్..
తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు శ్రీవారిని దర్శించుకున్నాడు. అంటే లియో మూవీ కూడా వెయ్యికోట్ల సినిమాగా మారనుందా. అసలే ఖైదీ, విక్రమ్ మూవీలు హిట్టైనా లోకేష్ కనకరాజ్ మాత్రం వెయ్యికోట్ల క్లబ్‌లో చేరలేదు. ఆ వెలితి ఈసారి లియోతో తీరుతుందా..?

Lokesh Kanagaraj: లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాలినడకన తిరుపతి వెంకన్నను దర్శించుకున్నాడు. లోకేష్ టీం కూడా తన వెంట వచ్చింది. సరే తెలుగు, తమిళ్ సినీ జనాలు.. ఇలా ఎక్కడైనా శ్రీవారిని దర్శించుకునేందుకు రావటం కామనే. కాని ఇక్కడ ఇది వార్తగా మారటానికి కారణం రూ.వెయ్యికోట్ల వసూళ్లు. లోకేష్ కనకరాజ్ కంటే ముందు జవాన్ మూవీ టీం తిరుపతి వెంకన్నని దర్శించుకుంది. అలా అట్లీ, షారుఖ్, దీపికా అండ్ కో శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇక జవాన్ వెయ్యికోట్ల వసూళ్లతో దూసుకెళ్లింది. 11 వందలకోట్ల క్లబ్‌లో కూడా చేరింది. కట్ చేస్తే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు శ్రీవారిని దర్శించుకున్నాడు. అంటే లియో మూవీ కూడా వెయ్యికోట్ల సినిమాగా మారనుందా. అసలే ఖైదీ, విక్రమ్ మూవీలు హిట్టైనా లోకేష్ కనకరాజ్ మాత్రం వెయ్యికోట్ల క్లబ్‌లో చేరలేదు. ఆ వెలితి ఈసారి లియోతో తీరుతుందా..? తమిళ్‌లో రూ.500 కోట్లు, తెలుగులో రూ.200 కోట్లు వచ్చినా హిందీలో రూ.300 కోట్లొస్తే ఈ డ్రీమ్ నిజమయ్యేఛాన్స్ ఉంది.
అదంతా జరగాలంటే లియో తెలుగుతో పాటు హిందీలో కూడా భారీగా హిట్ అవ్వాలి. అందుకే ఈ పూజలు, ఈ దర్శనాలంటున్నారు. ఏదైమేనా మ్యాటర్ ఉన్న దర్శకుడు, కంటెంట్ ఉన్న కథతో వస్తున్నప్పడు హీరో ఎవరైనా కాలం కలిసొచ్చే ఛాన్స్ ఉంది. గోవిందుడు కరుణిస్తే, లియో బాక్సాఫీస్‌ని షేక్ చేసే అవకాశముంది.