ఖైదీ, విక్రమ్, లియో హిట్లతో ఫోకస్ అయిన తమిల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఐతే తనతో ప్రభాస్ మూవీ ఓకే అయ్యిందని రెండు రోజులుగా ప్రచారంజరుగుతోంది. అంతవరకు ఓకేకాని, రెబల్ స్టార్ ని అడ్డు పెట్టుకుని, అమ్ముడు పోని అరవ సరుకుని అమ్మాలనుకుంటున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకుని, కోలీవుడ్ హీరోల ఇమేజ్ పెంచే కన్నింగ్ ప్రయత్నం జరుగుతోందట. మరి అతిగా ఊహించుకుంటున్నారా? రెబల్ స్టార్ మరీ అంత అమాయకుడా? లాంటి డౌట్లేమక్కర్లేదు. డార్లింగ్ కి రెండు వీక్ నెస్ లు ఉన్నాయి. వాటినే అరవోళ్లు టార్గెట్ చేసుకుంటున్నట్టున్నారు. నిజానికి ప్రభాస్ డైరెక్టర్లను నమ్మితే, వాళ్లు గంగలో దూకన్నా దూకేస్తాడు... మొహమాటం వల్ల కూడా తను కొన్ని సార్లు కమిటౌతాడు...మంచు విష్ణు అలా క్యాష్ చేసుకునే భక్త కన్నప్పలోకి ప్రభాస్ లాగాడన్నారు... నిజంగానే ప్రభాస్ ని కోలీవుడ్ డైరెక్టర్ కన్నింగ్ రీజన్ తో ఇరికిస్తున్నాడా? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ వెనక కన్నింగ్ కారణాలున్నాయా? రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే, ఖాన్లు, కపూర్లు అందుకోలేనంత ఎత్తుకి ఎదిగాడు. పాన్ ఇండియా లెవల్లో 5 హిట్లతో పాన్ ఇండియా కింగ్ గా మారాడు. తన మూవీ యావరేజ్ టాక్ వస్తేనే ఏడెనిమిది వందలకోట్లు ఈజీగా రాబడుతుందని ప్రూవ్ అయ్యింది. అంత ఇమేజ్ తనొక్కడికే సొంతం కాబట్టే, ప్రతీ దర్శకుడికి తనతో మూవీ తీయాలనేది డ్రీమ్ గా మారుతోంది. అదే ఒకరి విషయంలో శాపం అయ్యేలా ఉంది తమిళ స్టార్ డైరెక్టర్ లోకేస్ కనకరాజ్ కూడా అందుబాటులో, చరన్, ఎన్టీఆర్, బన్నీ ఉన్నా, ప్రభాస్ డేట్స్ కోసంమే సైలెంట్ గా ట్రై చేశాడు. ఆల్రెడీ పట్టేశాడని కూడా అంటున్నారు. ఆల్రెడీ లోకేష్ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా, తన గత సినిమాను, ప్రజెంట్ మూవీకి లింక్ చేసి, ఒక మూవీలో మరో హీరో ప్రస్థావన తెస్తున్నాడు గతంలో లియోలో ఖైదీ ప్రస్థావన వచ్చింది. సో రేపు రజినీకాంత్ కూలీలో లియో ప్రస్తావన కూడా రావచ్చు. ఇక ప్రభాస్ తో కూడా లోకేష్ సినిమా ఫైనలైతే, రెబల్ స్టార్ మూవీలో కూడా ఖైదీ, లియో, రజినీకాంత్ కూలీ ప్రస్తావన ఉండొచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ విజువల్స్ ని, లేదంటే తన కూలీ పాత్రని ప్రబాస్ మూవీలో ప్రస్తావిస్తే పోయేదేం లేదు కాని పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ రేంజ్ ఇమేజ్ లేని, తమిళ హీరో విజయ్, కార్తిలని రెబల్ స్టార్ మూవీలో ప్రస్తావించటం మీదే డౌట్లు పెరిగాయి. తమిళ హీరోలు ఎన్ని పాన్ ఇండియా మూవీలు చేసినా, నార్త్ ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. సో అమ్ముడుపోని సరుకుని, డిమాండ్ ఉన్న సరుకు మధ్యలో కలిపేసి అమ్మటం అన్న ప్లాన్ ని లోకేష్ అప్లై చేస్తున్నాడా? ఈ డౌట్ రావటానికి కారనం... ప్రభాస్ మూవీ కూడా లోకేష్ సినిమా టిక్ యూనివర్స్ లో భాగమయ్యే ఛాన్స్ ఉండటం. సో అందుకే ప్రభాస్ తో లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మూవీ తీస్తే, అందులో తమిళ స్టార్ విజయ్ ని గొప్పగా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ఉంది. కార్తి, ని కూడా అలా చూపిస్తే, ఇలా ప్రభాస్ ఇమేజ్ వెనక వాళ్ళని నార్త్ జనాల్లో పెంచే ప్రయత్నం అనంటున్నారు. నిజంగా అలాంటి ఉద్దేశ్యం లోకేష్ కి ఉందో లేదో కాని, ఈ కన్నింగ్ డౌట్ రావటానికి కారనం, అరవోళ్లు నార్త్ లో ఏం చేయలేకపోవటం. అందుకే షార్ట్ కట్ గా రెబల్ స్టార్ వాళ్లకి కనిపిస్తుండటం...ఇదే కారణాలతో అలాంటి డౌట్లు పెరిగాయి. [embed]https://www.youtube.com/watch?v=Kezo61P-VQo[/embed]