Prabhas lokesh : ప్రభాస్‌తో లోకేష్ కనగరాజ్ ఫిక్స్‌..!

పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) బాహుబలి (Baahubali) తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక‌.. రీసెంట్‌గా స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప్ర‌భాస్ క‌టౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. ఇక.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హైగా దూసుకుపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2024 | 10:30 AMLast Updated on: Mar 17, 2024 | 10:30 AM

Lokesh Kanagaraj Fix With Prabhas

పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) బాహుబలి (Baahubali) తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక‌.. రీసెంట్‌గా స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో ప్ర‌భాస్ క‌టౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. ఇక.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హైగా దూసుకుపోయింది. దీంతో.. ఈ డైనోసార్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ నెక్స్ట్ మూవీ కల్కి 2898 ఏడితో ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. దీనితో పాటు వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన డార్లింగ్.. మరొక క్రేజీ డైరెక్టర్ తో వ‌ర్క్ చేయ‌నున్న‌ట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్..

సలార్ మూవీతో తన అసలైన స్టామినా ఏమిటో రుచి చూపించిన ప్రభాస్.. ఇప్పుడు ఇండియన్‌ మార్కెట్‌పై ఫుల్‌ ఫోకస్ పెట్టాడు. ఇండియన్ మూవీ హిస్టరీలో ఏ హీరోకు సాధ్యం కాని విధంగా.. ఒక్క ప్రభాస్ పేరు మీదనే రానున్న రెండు మూడేళ్లలో దాదాపు మూడు వేల కోట్ల మార్కెట్ నడవనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్ర‌జెంట్ క‌ల్కితో పాటు ది రాజా సాబ్ షూటింగ్‌తోనూ ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు. వీటి అనంతరం స్పిరిట్ తో పాటు హను రాఘవపూడి తో ఒక మూవీకి ఫిక్స‌య్యాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేరిపోయింది.. కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో త్వ‌ర‌లోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కనున్న‌ట్లు వార్త‌లు వినిపిప్తున్నాయి.

యంగ్ రెబ‌ల్ స్టార్- లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) కాంబోలో ఒక మంచి యాక్షన్ మూవీ వస్తున్న‌ట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న న్యూస్ బట్టి ఇప్పటికే ప్రభాస్ కోసం లోకేష్ ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసారని తెలుస్తోంది. దీనిని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుండగా దీనికి అనిరుద్ సంగీతం అందించనున్నట్లు చెప్తున్నారు. త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ స్టోరీ ఉండబోతోంద‌ని తెలుస్తోంది. దీంతో.. త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో మరో డిఫరెంట్ కాంబినేషన్ ను చూడబోతున్నారు ఆడియన్స్.