ఏది ఏమైనా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఉండే రేంజ్ వేరు. అందుకే ఇప్పుడు తమిళంలో, కన్నడలో కూడా ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ కి వెళ్ళినా.. కల్కి సినిమాతో మాత్రం సౌత్ ఇండియా వాళ్లకు పిచ్చి లేపాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాల కోసం తమిళ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే ప్రభాస్ తో సినిమా కోసం తమిళ్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పటికే స్టోరీ రెడీ చేసుకుని ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. కర్ణాటక టాప్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రభాస్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తుంది. ఇక ఈ సినిమా కోసం లోకేష్ ఇప్పటికే వరకు మొదలు పెట్టాడు. కూలి సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వడంతో ఖాళీ టైంలో ప్రభాస్ కోసం వర్క్ చేయడం మొదలు పెట్టాడు. ప్రభాస్ కూడా ప్రస్తుతం కాస్త ఫ్రీగానే ఉన్నాడు. కాలికి గాయం కావడంతో పెద్దగా షూటింగ్ కు అటెండ్ అవ్వటం లేదు. ఫిబ్రవరి నుంచి ప్రభాస్ షూటింగు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ కి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. త్వరలోనే తిరిగి హైదరాబాద్ వస్తాడు. ఇక హైదరాబాద్ రాకుండా డైరెక్ట్ గా చెన్నై వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. లోకేష్ కనకరాజు ఎవరితో అయినా సినిమా చేస్తే కచ్చితంగా ఆ హీరోల లుక్ ని ముందే రిలీజ్ చేస్తాడు. గతంలో కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమా, అలాగే రజనీకాంత్ కూలి సినిమా లుక్... ఖైదీ సినిమా అయినా సరే లుక్ తో సినిమా క్రేజ్ ను పెంచేస్తాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఒక వీడియో కూడా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సినిమా అంటే ఇండియా వైడ్ గా క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్ ని మరింత పెంచడానికి ప్రభాస్ లుక్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశాడు లోకేష్. 30 సెకన్ల వీడియోని రిలీజ్ చేయడానికి ఇప్పటికే వర్కు కూడా స్టార్ట్ అయిపోయింది. సినిమా ఎలా ఉండబోతుంది. ఆ 30 సెకండ్లలో చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధాన్ని డిక్లేర్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఏ సినిమా చేసినా సరే ఆరు నెలల్లో కంప్లీట్ చేయడం లోకేష్ స్టైల్.. ఈ సినిమా కూడా అంతే. ఆరు నెలల్లో రిలీజ్ చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లేదంటే సమ్మర్లో దుమ్ము రేపడానికి రెడీ అయిపోతున్నాడు. ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో గానీ ఈ న్యూస్ బయటకు వచ్చిన దగ్గరనుంచి సోషల్ మీడియాను ఓ రేంజ్ లో స్క్రోల్ చేస్తున్నారు ఆడియన్స్.[embed]https://www.youtube.com/watch?v=v50UM4zp1fI[/embed]