PRABHAS: రెబల్ స్టార్‌తో లోకేష్ కనకరాజ్.. సినిమా ఖాయమేనా?

నిజానికి ప్రభాస్ కల్కి మూవీ పూర్తవుతున్నా, ఇంకా ది రాజా సాబ్ షూటింగ్ పెండింగ్ ఉంది. తర్వాత సలార్ 2 మొదలుకాబోతోంది. హనురాఘవ పూడి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే టైం దగ్గర పడింది. అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో స్పిరిట్ మొదలు కానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 06:14 PMLast Updated on: Mar 13, 2024 | 6:14 PM

Lokesh Kanagaraj Met Prabhas Are They Doing A Movie Together

PRABHAS: లోకేష్ కనకరాజ్ ఆమధ్య ప్రభాస్‌తో కథా చర్చలు జరిపాడు. కట్ చేస్తే ఖైదీ 2 పట్టాలెక్కుతుందన్నారు. కాని సూపర్ స్టార్ పిలుపుతో లోకేష్ సడన్ గా రజినీకాంత్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశాడు. ఈమధ్య మరోసారి ప్రభాస్‌ని లోకేష్ కనకరాజ్ కలిశాడు. ఇది పాత కథా చర్చల్లో బెటర్ అయిన కథ గురించే అని ప్రచారం మొదలైంది. నిజానికి ప్రభాస్ కల్కి మూవీ పూర్తవుతున్నా, ఇంకా ది రాజా సాబ్ షూటింగ్ పెండింగ్ ఉంది.

ALLU ARJUN: మూడు జోనర్లలో.. ముగ్గురితో సినిమాకు సై అన్న బన్నీ

తర్వాత సలార్ 2 మొదలుకాబోతోంది. హనురాఘవ పూడి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే టైం దగ్గర పడింది. అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో స్పిరిట్ మొదలు కానుంది. ఇవి కాకుండా కల్కి 2 ప్లానింగ్ కూడా జరుగుతోంది. ఇవన్నీ చూస్తే ప్రభాస్ మరో మూడేళ్ల వరకు కొత్త ప్రాజెక్టులకు అందుబాటులో ఉండటం కష్టమే. కాని లోకేష్ తనని మీటవ్వటమే అంచనాలకు అందట్లేదు. ఎందుకంటే తను కూడా రజినీకాంత్ మూవీ, ఆ తర్వాత ఖైదీ సీక్వెల్, విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ లెక్కన తను మూడేళ్లవరకు బిజీ.

అంటే మూడేళ్ల తర్వాత ప్రభాస్‌తో తీయాలనుకునే మూవీకి ఇప్పటినుంచే ప్లానింగ్ షురూ చేశాడా..? లేదంటే ఈలోపే ఏదైనా ఎనౌన్స్‌మెంట్ వచ్చి రజినీ కాంత్ మూవీ తర్వాతే ప్రభాస్ సినిమా అంటాడా..? సమ్మర్ తర్వాతే ఈ డౌట్లకు ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది.