Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ తప్పు తెలుసుకున్నాడా..? ఫీలవుతున్న రజినీ ఫ్యాన్స్..
ఖైదీ, విక్రమ్, లియో, సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయిన లోకేష్ కనకరాజ్ ఇక మీదట తను ఏ మూవీ తీస్తున్నా, రిలీజ్ డేట్ మాత్రం ముందే ఎనౌన్స్ చేయనంటున్నాడు. మొన్న లియో మూవీకి ఇదే తప్పు చేసి నరకం అనుభవించాడట.

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా తీయబోతున్నాడు. ఆల్రెడీ ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. సమ్మర్‌లో రజినీకాంత్ సినిమా మొదలు కానుంది. ఇలాంటి టైంలో తనకి బుద్దొచ్చింది. ఇంకోసారి తప్పు చేయనంటున్నాడు. ఇదే ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌కి నచ్చట్లేదు. ఖైదీ, విక్రమ్, లియో, సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయిన లోకేష్ కనకరాజ్ ఇక మీదట తను ఏ మూవీ తీస్తున్నా, రిలీజ్ డేట్ మాత్రం ముందే ఎనౌన్స్ చేయనంటున్నాడు.
SALAAR FIRST REVIEW: సైడ్ ఇవ్వాల్సిందే.. సలార్ ఫస్ట్ రివ్యూ..
మొన్న లియో మూవీకి ఇదే తప్పు చేసి నరకం అనుభవించాడట. ఒకసారి సినిమా తీస్తూ, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే.. అనుకున్న టైంకి సినిమాని పూర్తిచేయాలన్న ప్రెజర్‌లో కొన్ని విషయాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా మూవీ మేకింగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అదే లియో విషయంలో జరిగి క్లైమాక్స్‌కి సరిగా ప్లాన్ చేయలేకపోయాడట. సెకండ్ హాఫ్ మరింత ట్రిమ్ చేయలేకపోయాడట. దీంతో లియో స్లో నెరేషన్ అన్న కామెంట్స్ ఫేస్ చేసింది.
అదే తప్పు.. ఈ సారి జరక్కూడదంటే సినిమా పూర్తయ్యే వరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. దీంతో రజినీకాంత్ సినిమా ఎప్పుడొస్తుందో తేల్చకపోతే ఎలా అని ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది.