Jr. NTR: ఎన్టీఆర్ మూవీతో.. లోకేష్ కనకరాజ్ ఆఖరిపోరాటం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ డైరెక్టర్ కెరీర్ ని క్లోజ్ చేయబోతున్నాడు. అదేదో పగతోనో లేదంటే ప్రతీకారంతోనో దర్శకుడి కెరీర్ ని క్లోజ్ చేయటం కాదు, కాని తన సినిమాతోనే ఒక దర్శకుడి ఫ్యూచర్ ఆగిపోబోతోందట. అతనే లోకేష్ కనకరాజ్.

Lokesh Kanakaraj has done big movies
ఖైదీ, విక్రమ్ మూవీలతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనకరాజ్. అలాంటి తను పదంటే పదే సినిమాలు తీసి ఇక సినిమాలకు గుడ్ బై చెబుతా అన్నాడు. ఆ వార్తలు నెట్లో వైరలయ్యాయి. ఐతే ఇప్పుడు లోకేష్ రిటైర్మెంట్ పెద్ద మ్యాటర్ కాదు, తన ఆఖరి సినిమా ఎవరిది అనేదే హాట్ టాపికైంది.
ఆల్రెడీ రజినీకాంత్ తో లోకేష్ తీయబోయేది ఆరోసినిమా మాత్రమే కాదు, సూపర్ స్టార్ ఆ మూవీ తీశాకే సినిమాలకు గుడ్ బై చెబుతాడనే రూమర్ ఉంది. అలా రజినీతో 6 సినిమాతీశాక లోకేష్ చరణ్, కార్తి, సూర్యాతో సినిమాలు ప్లాన్ చేసుకున్నాడట. గతంలో ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం వాళ్లోతో మూవీలు తీయాలి. అలానే ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేస్తా అన్నాడట లోకేష్. అదే చివరి సినిమా అవుతుందని తెలుస్తోంది. 2030 లో తారక్ తో తీసే సినిమా తర్వాతే లోకేష్ సినిమాలకు గుడ్ బై చెప్పే చాన్స్ ఉంది. అది కూడా తను 10 సినిమాల తర్వాత కెరీర్ కి గుడ్ బై చెబుతా అన్న మాటే ఫాలో అయితేనే..