Ram Charan: రామ్ చరణ్, ప్రభాస్ కి.. లోకేష్ కనకరాజ్ అవమానం..?
లోకేష్ కనకరాజ్ ఎంత టాలెంటెడ్ డైరెక్టరో ఖైదీ, విక్రమ్ హిట్లతో చెప్పొచ్చు. ఒకటి రెండు హిట్లతోనే ఈ దర్శకుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. రాజమౌళి స్థాయికెల్లాడు.. అంతవరకు బానే ఉంది. కాని తను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చేసిన అవమానమే ఇబ్బంది కరంగా మారుతోంది.

Lokesh Kanakaraj insulted Ram Charan and Prabhas
అసలు విషయం ఏంటంటే, లోకేష్ కనకరాజ్ కి రెండు సార్లు రామ్ చరణ్ ఆఫర్లు ఇచ్చాడట. ఖైదీ హిట్ అయినప్పుడు, అలానే విక్రమ్ హిట్ అయినప్పుడు.. కాని రెండు సార్లు తను నో చెప్పటమే కాదు, విజయ్ తో లేదంటే సూర్యతో సినిమాలు కమిటౌతూ చెర్రీని లైట్ తీసుకున్నాడు..
సరే విజయ్ తో లియో మూవీ అయిపోయింది కదాని మళ్లీ చరణ్ కాల్ చేస్తే, ఇంతలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కు సైన్ చేశాడు. ఇలా చరణ్ నే కాదు ప్రభాస్ పిలిచి ఆఫర్ ఇస్తే ఇంతవరకు ఆన్సర్ లేదట. అదేంటో విజయ్, కమల్ హాసన్, సూర్య, ఆతర్వాత రజినీకాంత్, ఆవెంటనే కార్తి తో ఖైదీ 2 అంటూ కోలీవుడ్ కే పరిమితమౌతున్నాడు లోకేష్. తను ముందే కమిటైతే వేరే విషయం కాని, తనే కమిట్ మెంట్ ఇవ్వకముందే చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ పిలిచి పిజ్జా ఇస్తానంటే, వద్దు సాంబరే సరిపోతుందంటున్నాడట లోకేష్.