Prabhas..Ramcharan: ప్రభాస్, రామ్ చరణ్ మల్టీ స్టార్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా..?
తెలుగులో మరో అసలు సిసలైన మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. 2024 లేదంటే 2025లో ఇద్దరు టాప్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్ మూవీ సిద్దం అవుతోంది.

Lokesh Kanakaraj is planning a multi-starrer movie with Prabhas and Ram Charan combo
తెలుగులో మరో అసలు సిసలైన మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. ఎవరూ ఊహించనివిధంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన ఆర్‌ఆర్‌ఆర్ కాంబినేషన్ తర్వాత అలాంటి స్టార్ కాస్టింగ్ జరగలేదు. 2024లో.. లేదంటే 2025లో ఇద్దరు టాప్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్ మూవీ సిద్దం అవుతోంది.
ఒక పెద్ద హీరో.. ఒక యంగ్ హీరో కలిస్తే మల్టీస్టారర్ మూవీ కాదు. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయితే.. ఒక సీనియర్.. స్టార్ కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మల్టీస్టారర్‌కు ఊపిరి పోసినా.. అసలు సిసలైన మల్టీస్టారర్‌గా ఆర్‌ఆర్‌ఆర్ తెరకెక్కింది. ప్రభాస్ ఆ మధ్య కల్కి గ్లిమ్స్ రిలీజ్‌లో మాట్లాడుతూ.. చరణ్ పర్సనల్‌గా తనకు మంచి స్నేహితుడన్నాడు. మంచి కథ దొరికి.. ఛాన్స్ వస్తే చరణ్‌తో తప్పకుండా సినిమా చేస్తానన్నాడు ప్రభాస్. ఆల్రెడీ కథ దొరికింది కాబట్టే అలా అన్నాడా అనిపిస్తుంది.
ప్రభాస్, రామ్‌చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతిని అన్‌స్టాపబుల్ షోతో తెలిసింది. వీళ్లిద్దరూ ఇంత మంచి స్నేహితులా అనుకున్నారంతా. ప్రభాస్, రామ్‌చరణ్ కాంబోను లోకేశ్ కనగరాజ్ కలుపుతున్నాడు. ఈ దర్శకుడు రాసుకునే కథల్లో ఇద్దరు ముగ్గురు హీరోలుంటారు. విక్రమ్ మూవీలో కమల్‌తోపాటు.. విజయ్ సేతుపతి.. ఫహద్ ఫాజిల్.. సూర్య నటించారు. లియోలో మలయాళ కుర్ర హీరో మాథ్యూ థామస్, సంజయ్‌దత్ నటిస్తున్నారు. చాలామంది స్టార్స్‌తో సినిమాను తీయడానికి అలవాటు పడ్డ లోకేశ్ ప్రభాస్ మూవీని కూడా ఇలాగే స్టార్స్‌తో నింపేస్తున్నాడు.
ప్రభాస్, లోకేశ్ కనగరాజ్ సినిమాను ఇంకా ఎనౌన్స్ చేయకపోయినా.. దాదాపు ఖరారైనట్టే. ప్రభాస్, సిద్దార్థ్ ఆనంద్ కాంబో క్యాన్సిల్ కావడంతో.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్, లోకేశ్ కాంబోను రెడీ చేస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలుకావడం కష్టమే. లోకేశ్ ప్రస్తుతం విజయ్‌తో తీస్తున్న లియో అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆతర్వాత ఖైదీ 2 రెడీగా వుంది. ఇంతలో రజనీకాంత్‌తో ఓ సినిమాను ఓకె చేయడంతో ముందు ఏది మొదలవుతుందో చెప్పడం కష్టం. విక్రమ్2 కూడా లైన్లో వుంది. కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయితేగానీ.. ప్రభాస్ సినిమాపై క్లాప్ పడదు . ప్రభాస్ రామ్ చరణ్ కాంబోలో మల్టీ స్టార్ మూవీ రావడం ఊహించుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది.
ఎందుకంటే వీళ్ళిద్దరి పర్సనాలిటీలు మ్యాచ్ కావు. బాహుబలిలో ప్రభాస్, రానా ఒకే హైటు ఒకే వెయిట్ ఉండటంతో రెండు టవరింగ్ క్యారెక్టర్స్ మనకి ఆ మూవీలో కనిపించాయి. అలాగే త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఒకే హైట్ అవ్వడం వల్ల.. అలాగే ఇద్దరు ఫిజిక్స్ కూడా.. మాన్లిగాను.. సూపర్ షేప్ తో ఉండటం వల్ల ఇద్దరినీ ఒకే రకంగా చూడ గలిగాం. కానీ ఇప్పుడు ప్రభాస్ రామ్ చరణ్ అనేటప్పటికీ ఆరడుగుల ప్రభాస్, ఐదు అడుగుల 8 అంగుళాల రామ్ చరణ్ ఎలా సెట్ అవుతుంది. ఇద్దరు పాత్రని ఎలా డిజైన్ చేయగలుగుతారు. ప్రభాస్ కటౌట్ ముందు చెర్రీ నిలబడతాడా.. ఇలాంటి డౌట్లు వస్తున్నాయి. అయితే సినిమా 2025 లో మొదలవుతుంది కనుక.. అప్పుడే అన్ని డౌట్స్ బయట పెట్టేస్తే గంధర గోళం ఎక్కువైపోద్ది. బిజినెస్ పరంగా చూస్తే మాత్రం ప్రభాస్ ,రామ్ చరణ్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీస్ లో నే సూపర్ కమర్షియల్ కాబోతుంది.