కల్కీ, దేవర, సలార్ మీద లేని డౌట్లు… ఆ మూవీ మీదే…

పుష్ప 2 వల్ల సంధ్యా థియేటర్ లో ఓ నిండు ప్రాణం పోయింది. తొక్కిసలాటే కారనం కావొచ్చు...నిర్లక్షమే ఫలితమే ఇదంటూ వారం రోజులుగా వివాదం సాగుతూ ఉండొచ్చు. ఐతే బన్నీ నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయ్యిందనే కామెంట్లు మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2024 | 03:14 PMLast Updated on: Dec 28, 2024 | 3:14 PM

Lots Of Doubts On Salar 2 Movie

పుష్ప 2 వల్ల సంధ్యా థియేటర్ లో ఓ నిండు ప్రాణం పోయింది. తొక్కిసలాటే కారనం కావొచ్చు…నిర్లక్షమే ఫలితమే ఇదంటూ వారం రోజులుగా వివాదం సాగుతూ ఉండొచ్చు. ఐతే బన్నీ నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయ్యిందనే కామెంట్లు మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఇండస్ట్రీ జనం కూడా ఓపెనైపోతున్నారు. ఇలాంటి టైంలో 1704 కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప 2 అంటూ పోస్టర్ వచ్చింది. నార్త్ ఇండియాలో 800 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేస్తున్న పుష్ప2 అంటున్నారు. కల్కీ వచ్చినప్పుడు కూడా కామెంట్లొచ్చాయి.. దేవర కైతే ఊహించని స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ కనిపించింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా షాక్ ఇచ్చింది. ఇన్ని జరగినా కల్కీ 1200 కోట్ల వసూల్ల మీద ఎవరికీ అనుమానాలు లేవు… దేవర 510 నుంచి 670 కోట్లు రాబట్టిందంటే ఎక్కడా డౌట్లు రాలేదు.. కాని పుష్ప2 కి 1700 కోట్లు వచ్చాయన్నా నమ్మట్లేదు. బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయబోతున్న పుష్ప2 అని అంటున్నా, పట్టించుకున్న నాథుడు లేడు… ఎందుకలా? హావేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ రిలీజైనప్పుడు, వసూల్ల వరదొచ్చింది. 20రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. సినిమాలో ప్రభాస్ పాత్ర మీద బాలీవుడ్ నటుడు మాట జారి ఉండొచ్చు. కుళ్లుతో యాంటీ ఫ్యాన్స్ కల్కీ మీద కామెంట్లు చేయొచ్చు. కాని పాన్ ఇండియా లెవల్లో ఎవరూ కూడా కల్కీ వసూల్ల మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు.

తర్వాత వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర వసూళ్లని కూడా ఎవరూ డౌట్ పడలేదు. ఈ సినిమా వచ్చిన కొత్తలో అయితే నార్త్ ఇండియాలో యాంటీ ఫ్యాన్స్ ఎంతగా వాల్లలోని కుళ్లుని బయటపెట్టారంటే, ఇదో డిజాస్టర్ అన్నారు.

సౌత్ లో కూడా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా కామెంట్లు, ట్రోలింగ్స్ ఓటీటీలో వచ్చే వరకు కూడా ఆగలేదు. అంత జరిగినా ఎవరూ దేవర వసూల్లని అనుమాన పడలేదు. ఎంతైనా త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ కి నార్త్ లో వచ్చిన మాస్ ఇమేజ్, దేవరకి కూడా కంటిన్యూ అయ్యిందన్నారు. సౌత్ కంటే నార్త్ లోనే తనకి ఎక్కువ వసూళ్లు రావటం చూసి, తన ఫ్యాన్ పాలోయింగ్ నార్త్ లో కూడా పెరిగిందన్నారు.

ఇంత జరిగినా 510 కోట్ల నుంచి 670 కోట్ల వరకు వచ్చిన వసూళ్ల వైపు ఎవరూ వేలెత్తి చూపించలేదు. విచిత్రం ఏంటంటే పుష్ప 2 వసూళ్లు 1000 కోట్ల క్లబ్ లో చేరినప్పటి నుంచి 1704 కోట్లవసూళ్లొచ్చాయనేంత వరకు, ఏ ఒక్క ఎమౌైంట్ ని ఎవరూ నమ్మినట్టు కనిపించట్లేదు. జనాల నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ కనిపించట్లేదు

పుష్ప హిట్ అందులో ఎలాంటి డౌట్ లేదు. దాని సీక్వెల్ కాబట్టి పార్త్ 2 కూడా దుమ్ముదులిపేయటం కూడా కామనే.. కాకపోతే పుష్ప2 మూవీ సెకండ్ హాఫ్ లో కథ బాలేక, కామెంట్లొచచాయి. సౌత్ లో వసూళ్లు డ్రాప్ అయ్యాయి. మల్లూ అర్జున్ అని పిలుచుకునే మలయాళం మార్కెట్ లో పుష్ప2 డిజాస్టర్ అని తేల్చేశారు.. ఇన్ని జరిగినా ఇప్పటికి 1500 కోట్లు, 1600 కోట్లు, 1700 కోట్లంటూ మూడు నాలుగురోజులకో పోస్టర్ వస్తుంటేనే డౌట్లు పెరిగాయి

ఈ సినిమా కూడా సౌత్ కంటే నార్త్ లో నే జనాలకు బాగా రీచ్ అయ్యింది. అందులో డౌట్ లేదు. కాని అక్కడా రోజుకి 10నుంచి 15 కోట్లే ఘగనంగా వస్తున్నాయి. కాని పుష్ప2 మూవీకి 1500 కోట్ల నుంచి 1700 కోట్లకు పెరగటమేకాదు, బాహుబలి 2 రికార్డుని ఈవారంలో బ్రేక్ చేయనుందంటున్నారు. ఇది నిజంగా సాద్యమేనా..? ఒక వైపు పుష్ప2 జోరు విడుదలైన 10 రోజులకే తగ్గిందన్నారు. మరోవైపు వసూళ్లు మాత్రం 1000 కోట్ల నుంచి 1700 కోట్లకు చేరాయంటున్నారు. ఇలాంటి టైంలో సంధ్యా థియేటర్ ఇష్యూ, తర్వాతైన కేసు ఇలా ఈ సీక్వెన్స్ తో సీనే మారిపోయింది

అన్నీంటికి మించి 1850 కోట్ల బాహుబలి రికార్డుని బ్రేక్ చేయటమే కాదు, కేవలం హిందీ మార్కెట్ లోనే 1000 కోట్లు రాబట్టటనున్న పుష్ప 2 అని ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ హిందీ మార్కెట్ లోనే 800 కోట్లు రాబట్టిన సినిమా అంటూ ప్రచారం పెరిగింది… ఇలాంటి వార్తలే కాని, మార్కెట్ లో మాత్రం వైబ్రేషన్స్ కనిపించట్లేదు. వినిపించట్లేదు. అందుకే ఈ కలెక్షన్స్ లెక్కల మీద డౌట్లు పోవట్లేదు.