లక్కీ భాస్కర్ రివ్యూ, 100 కోట్ల బొమ్మ

మలయాళ హీరో అయినా సరే... మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై... సీతారామం సినిమాతో తెలుగు స్టార్ హీరో... అనే ఇమేజ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్... లక్కీ భాస్కర్ తో మరో హిట్ కొట్టేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 31, 2024 | 12:34 PMLast Updated on: Oct 31, 2024 | 12:34 PM

Lucky Bhaskar Review

మలయాళ హీరో అయినా సరే… మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై… సీతారామం సినిమాతో తెలుగు స్టార్ హీరో… అనే ఇమేజ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్… లక్కీ భాస్కర్ తో మరో హిట్ కొట్టేసాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మరి లక్కీ భాస్కర్ తెలుగు ప్రేక్షకులకు ఎలా నచ్చాడో ఒకసారి చూసేద్దాం.

లక్కీ భాస్కర్ సినిమాను… ఒక యువ బ్యాంక్ ఉద్యోగి జీవితం చుట్టూ, అతని కష్టాలు, అతని చుట్టూ చోటు చేసుకునే కొన్ని మలుపులు సినిమాలో ప్రధానంగా తీసుకున్నారు. 90వ దశకం ప్రారంభంలో, లక్కీ భాస్కర్… మగద్ బ్యాంక్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తాడు. భాస్కర్‌కు వచ్చే చిన్నపాటి జీతం తొమ్మిది వేల రూపాయలతో… అతని కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉంటుంది. గ్రామంలో పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉంటాడు. ఈ అప్పులతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలు అవుతాయి. ఈ సమయంలో భాస్కర్ సోదరి ప్రేమ వివాహం కూడా ఉంటుంది.

ఈ సమయంలో… భాస్కర్ ను బ్యాంక్‌లో పదోన్నతి కోసం బదిలీ చేస్తారు. ఈ సమయంలో ఏం చేయాలో అర్ధం కాని భాస్కర్… బ్యాంకులో జరిగిన చిన్న స్కాంతో తన లక్ ను టెస్ట్ చేసుకోవాలి అనుకుంటాడు. అక్కడి నుంచి భాస్కర్ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది కథ. తెలుగు సినిమాలో ఈ తరహా కథలు కాస్త కొత్త. కాని ఆర్ధిక నేరాలపై సినిమాలు చాలానే వచ్చినా ఈ సినిమా మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. లక్కీ భాస్కర్ సినిమా… 1990 లలో దేశాన్ని కదిలించిన స్టాక్ మార్కెట్ కుంభకోణం నుండి ఈ కథను తీసుకున్నారు.

సినిమా టేకింగ్ లో ఉండే ట్విస్ట్ లు చాలా బాగుంటాయి. సిబిఐ అధికారులు భాస్కర్‌ని అరెస్టు చేయడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడే అతను కథ మొత్తం చెప్తాడు. కుటుంబ కష్టాలను చూడలేక… డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు. సినిమా ఇక్కడే స్పీడ్ అందుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా హైప్ ను పెంచేస్తుంది. సెకండ్ ఆఫ్ పై హైప్ క్రియేట్ అవ్వడానికి ఇదే కారణం. డైరెక్టర్ వెంకీ అట్లూరి టాలెంట్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమాలో ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించాడు. యాక్షన్ సీన్స్ లేకపోయినా సినిమాలో హైప్ మాత్రం యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటుంది. “వేగంగా వెళ్లే బండి, వేగంగా కదులుతున్న రూపాయి కొన్నిసార్లు మనిషిని పడగొడతాయి,” వంటి డైలాగ్ లు సినిమాలో హైలెట్.

ఈ సమయంలో వచ్చిన భాస్కర్ కొడుకు పుట్టిన రోజు కూడా సినిమాకు హైలెట్. జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. ముంబై వీధులు, ఇళ్లు మరియు ఆ కాలంలోని బ్యాంకులను చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పాలి. ఇక మధ్యతరగతి భాస్కర్‌గా దుల్కర్ సల్మాన్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో దుల్కర్ యాక్షన్ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ట్విస్ట్ లు లేకపోయినా సినిమా మాత్రం బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ లో మంచి సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోతుంది. ఓవరాల్ గా ఫ్యామిలీతో చూడాల్సిన మంచి సినిమా. దుల్కర్ కు మరో హిట్ పడింది.