మొన్న దేవర, ఇప్పుడు డాకూ.. నందమూరి హీరోలకు లక్కీ ప్రొడ్యూసర్
టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ ఇయర్.. ఈ ఇయర్ రిలీజ్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో... నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది. లాస్ట్ ఇయర్.. ఈ ఇయర్ రిలీజ్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో… నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా తర్వాత పండగ చేసుకుంటుంటే… ఇప్పుడు డాకు మహారాజు సినిమాతో నందమూరి అభిమానులకు సంక్రాంతి డబల్ అయింది. ఈ రెండు సినిమాలు నిర్మాత సూర్యదేవర నాగవంశీ నందమూరి హీరోలతో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించే నాగ వంశీ ఇప్పుడు నందమూరి హీరోలకు పెట్టుబడి పెట్టాలంటే ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలను సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళుతున్నాడు. దేవర సినిమాతో సూర్యదేవర నాగవంశీకి భారీ లాభాలు రాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తో చేసిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా లాభాల పంట పండించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. బడ్జెట్ తక్కువగా ఉండటంతో… సినిమాకు ప్రాఫిట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అనే టాక్ వినపడుతోంది. బాలకృష్ణ సినిమాలంటే ప్రొడ్యూసర్ భయపడే టాక్ నుంచి సూపర్ హిట్ సినిమాలు అనే టాక్ వచ్చేసింది.
దీనితో బాలయ్యకు పెట్టుబడి పెట్టడానికి నాగవంశీ బ్యాక్ స్టెప్ వేయడం లేదు. అటు దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాలపై కూడా గట్టిగానే ఫోకస్ చేశాడు. అయితే మెగా హీరోల సినిమాలు విషయంలో మాత్రం ఈ స్టార్ ప్రొడ్యూసర్ అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇప్పుడు సూర్యదేవర నాగ వంశి అంటే ఓ నమ్మకం క్రియేట్ అయిపోయింది. దేవర సినిమా టైంలో డిస్ట్రిబ్యూటర్లు భారీగా లాభాలు చూశారు. ఆ సినిమాను ముందు సోషల్ మీడియాలో టార్గెట్ చేసినా సరే మంచి వసూళ్లు సాధించడంతో… డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చాయి.
ఇక నిర్మాతగా కూడా నాగ వంశీ అక్కడ నుంచి మరింత జోష్ పెంచారు. అందుకే బాలయ్య సినిమాకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెట్టుబడి పెట్టేశారు. ఇలా నందమూరి అభిమానులకు కూడా నాగవంశీ బాగానే కనెక్ట్ అవుతున్నాడు. సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ ప్రొడ్యూసర్. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్… అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా భారీగానే పెట్టుబడి పెట్టేందుకు నాగ వంశీ రెడీ అయ్యాడు. కానీ మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి లేదంటే ఇతర హీరోలకు మాత్రం అంతగా వంశీ ఇంట్రెస్ట్ చూపించకపోవడం హాట్ టాపిక్ అయింది.