Maa Oori Polimera 2: భయపెడుతోన్న పొలిమేర 2 ట్రైలర్.. హిట్ గ్యారెంటీనా..?
అప్పుడంటే లాక్‌డౌన్ కాబట్టి.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కానీ.. ఇప్పుడు పొలిమేర 2 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. రీసెంట్‌గా రిళీజైన పొలిమేర 2లో.. మొదటి సినిమాకు మించిన ట్విస్టులు, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Maa Oori Polimera 2: లాక్‌డౌన్ టైమ్‌లో ఓటీటీ (OTT)లో రిలీజై సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సినిమా ‘మా ఊరి పొలిమేర’. ఆహా ఓటిటిలో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని పర్ఫెక్ట్ ఎండింగ్‌తో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. చేతబడి.. మూఢనమ్మకాలు.. హత్యలు.. అనుమానస్పద మరణాల చుట్టూ కథను అల్లుకొని.. ఓవైపు భయపెడుతూనే థ్రిల్‌కి గురిచేసింది సినిమా. ఆ ఎక్స్పీరియన్స్‌ని ఎవరూ మర్చిపోలేరు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన పొలిమేర సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం అయిపోయింది. అదే మా ఊరి పొలిమేర 2 (Maa Oori Polimera 2).
అప్పుడంటే లాక్‌డౌన్ కాబట్టి.. ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కానీ.. ఇప్పుడు పొలిమేర 2 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. రీసెంట్‌గా రిళీజైన పొలిమేర 2లో.. మొదటి సినిమాకు మించిన ట్విస్టులు, ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే భయానకమైన సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో చూపించి థ్రిల్ చేశారు. మూతబడిన దేవాలయ మిస్టరీకి.. చేతబడిని లింక్ చేస్తూ.. ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యే విధంగా ట్రైలర్‌లో ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. మహబూబ్ నగర్‌లో దారుణం.. అసలు చేతబడులు ఉన్నాయా అన్న పాయింట్‌తో మొదలైన ట్రైలర్ క్యూరియాసిటిని పెంచింది. ఇక ఈ చిత్రంలోని విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.
సన్నివేశాలు అన్నీ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉండడంతో పాటు పలు అంశాల పైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచేస్తోంది. చేతబడిని మాత్రమే హైలెట్ చేస్తూ మా ఊరి పొలిమేర-2 సీక్వెల్ని సైతం తెరకెక్కించారు. మరి ఇందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయోనని ఆసక్తి అందరిలో నెలకొంది. ట్రైలర్‌తోనే అంచనాలను ఆకాశానికి తాకేలా చేసిన ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే నవంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.