మా ప్రభాస్ బంగారం.. రాజా సాబ్ కోసం రెబల్ స్టార్ అంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడా..?
ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనం అనుకుంటుంటే.. ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ మాత్రం సింపుల్గా ఏడాదికి ఒక సినిమా.. కుదిరితే రెండు సినిమాలు కూడా విడుదల చేస్తున్నాడు.

ఈ రోజుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనం అనుకుంటుంటే.. ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ మాత్రం సింపుల్గా ఏడాదికి ఒక సినిమా.. కుదిరితే రెండు సినిమాలు కూడా విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. రెండేళ్ల కింది వరకు ఆదిపురుష్, సలార్, కల్కి, రాజా సాబ్.. ఇలా ఒకేసారి అన్ని సినిమాలు మొదలు పెట్టాడు ప్రభాస్. అందులో ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ మిస్ అయింది. అందుకే ఇప్పుడు ఒకసారి ఒక సినిమా మాత్రమే అనే రూల్ పాస్ చేశాడు. ప్రస్తుతం రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో మారుతి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. అందుకే ఫోకస్ అంతా ఫౌజి మీద పెట్టాడు ప్రభాస్.
ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాల్లోనే నటిస్తున్నాడు. ఈయన సినిమాల కోసం ఈజీగా 300 నుంచి 400 కోట్ల మధ్యలో బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. అయితే మారుతీ తెరకెక్కిస్తున్న రాజా సాబ్.. మిగిలిన సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువ బడ్జెట్ తో వస్తుంది. అంత మాత్రాన ఇదేదో కామెడీ సినిమా అనుకుంటే పొరపాటే. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి అంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలి అనుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో అక్టోబర్లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రభాస్. రాజా సాబ్ కోసం ఈయన రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఎలాగో తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి.. తన రెమ్యూనరేషన్ కాకుండా బిజినెస్ లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. దాని వల్ల నిర్మాతకు కనీసం 100 కోట్లకు పైగానే మిగులుతాయి. ఎందుకంటే ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నాడు. రాజా సాబ్ బడ్జెట్ తక్కువ కాబట్టి కనీసం 100 కోట్ల రెమ్యూనరేషన్ అనుకున్నా.. కష్టాల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడవి మిగిలినట్లే. రేపు సినిమా విడుదల సమయంలో జరిగే బిజినెస్ లో షేర్ తీసుకుంటానని నిర్మతలతో ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చాలా మంచి పద్ధతి అవుతుంది. ఎందుకంటే బాలీవుడ్లో షారుక్ ఎప్పటి నుంచో ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. దానివల్ల తీసుకునే పారితోషికం కంటే డబుల్ డబ్బులు వస్తాయి. ఏదేమైనా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజా సాబ్ క్వాలిటీ ఇంకా పెరగడం ఖాయం.