మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ రివ్యూ.. ఆ ఒక్కటే మైనస్.. సినిమాలో మేజర్ హైలెట్స్ ఇవే..!

కొన్నిసార్లు కేవలం బ్రాండ్ మీద సినిమాలు నడుస్తుంటాయి. బాహుబలి, పుష్ప, కేజిఎఫ్.. ఈ సినిమాల రెండో పార్ట్స్ అంత పెద్ద విజయం సాధించాయి అంటే దానికి కారణం..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 02:20 PMLast Updated on: Mar 25, 2025 | 8:48 PM

Mad Square First Review Thats The Only Minus These Are The Major Highlights Of The Movie

కొన్నిసార్లు కేవలం బ్రాండ్ మీద సినిమాలు నడుస్తుంటాయి. బాహుబలి, పుష్ప, కేజిఎఫ్.. ఈ సినిమాల రెండో పార్ట్స్ అంత పెద్ద విజయం సాధించాయి అంటే దానికి కారణం.. వాటి మొదటి పార్ట్ కు వచ్చిన బ్రాండ్. అందుకే సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉందని చూడకుండా కలెక్షన్స్ మాత్రమే ఇచ్చారు ఆడియన్స్. ఒక్కో సినిమాకు వందల కోట్లు కట్టబెట్టారు. తాజాగా ఇదే సీక్వెల్ సెంటిమెంట్ నమ్ముకుంటూ వస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దీనికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. డీజే టిల్లు తర్వాత మన దగ్గర యూత్ ఫుల్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావడంతో.. అదే సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ సినిమాకు సీక్వెల్ వస్తుంది. రెండేళ్ల కింద విడుదలైన మ్యాడ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కాలేజ్ ఎంటర్టైనర్ అంచనాలకి మించి సంచలన వసూళ్ళు సాధించింది.

దాంతో సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ సెన్సార్ రివ్యూ ప్రకారం 100 పర్సంట్ కాదు 200 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఖాయం అంటున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డు పడేవరకు నవ్వి నవ్వి చచ్చిపోతారు అంటున్నారు సెన్సార్ సభ్యులు. ఈ సీక్వెల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనే టాక్ అక్కడి నుంచి వచ్చింది. సెకండ్ పార్ట్ అంతా లడ్డు పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఆ పెళ్లి కోసం అందరూ కలిసి గోవాకు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేది అసలు కథ. పొట్ట చెక్కలయ్యే ఎంటర్టైన్మెంట్ ఇందులో ఖాయం అని చిత్ర యూనిట్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. తాజాగా సెన్సార్ బోర్డు నుంచి కూడా ఇలాంటి రివ్యూనే వచ్చింది. ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక మైనస్.. రన్ టైం. కేవలం 2 గంటల 10 నిమిషాలతోనే ఈ సినిమా వస్తుంది. మరో 20 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా ప్రేక్షకులు ఈజీగా ఎంజాయ్ చేస్తారని.. కానీ చాలా తక్కువ టైంలో ఈ సినిమాను ముగించేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఒక రకంగా మ్యాడ్ స్క్వేర్ సినిమాకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 2025, మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. మరి చూడాలి సీక్వెల్ కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో..