మ్యాడ్ స్క్వేర్’ టీజర్ రివ్యూ.. నవ్వి నవ్వి పోతే ఎవడిదండి రెస్పాన్సిబిలిటీ..!
బాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తుంటాయి.. కానీ మన దగ్గర మాత్రం ఆ ట్రెండ్ లేదు. కానీ డీజే టిల్లు వచ్చిన తర్వాత ట్రెండు పూర్తిగా మారిపోయింది.

బాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తుంటాయి.. కానీ మన దగ్గర మాత్రం ఆ ట్రెండ్ లేదు. కానీ డీజే టిల్లు వచ్చిన తర్వాత ట్రెండు పూర్తిగా మారిపోయింది. టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావడంతో.. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నారు. రెండేళ్ల కింద విడుదలైన మ్యాడ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కాలేజ్ ఎంటర్టైనర్ అంచనాల గురించి సంచలన వసూళ్ళు సాధించింది. దాంతో సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి.
తాజాగా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. మ్యాడ్ సినిమాలో తనదైన శైలిలో కామెడీ పండించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఈ సీక్వెల్ తో మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించబోతున్నాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. సెకండ్ పార్ట్ అంతా గోవాలో ప్లాన్ చేశాడు డైరెక్టర్.
లడ్డు పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ బ్యాచ్ గోవాకు వెళ్లి ఏం చేశారనేది మిగిలిన కథ. ఇందులో కూడా అనుదీప్ కనిపిస్తున్నాడు. పైగా టీజర్ మొదట్లోనే వెంకీ అట్లూరి, అనుదీప్, సూర్యదేవర నాగ వంశీ అంటూ వాళ్ల మీద వాలే సెటైర్లు వేసుకోవడం బాగా పేలింది. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. మరి చూడాలి సీక్వెల్ కూడా అదే రేంజ్ లో అలరిస్తుందో లేదో..!