Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్‌కు కోర్టు మొట్టికాయలు.. లక్షరూపాయల జరిమానా..
త్రిషతో తనకు రేప్ సీన్ లేనందుకు బాధపడుతున్నా అని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో చాలా మంది మన్సూర్ అలీ ఖాన్‌పై మండిపడ్డారు. త్రిష కూడా అతనితో ఇంకెప్పుడూ పని చేయను అని తేల్చి చెప్పేసింది.
Mansoor Ali Khan: సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ అంశం వివాదాస్పదం కావడంతో చివరకు క్షమాపణలు చెప్పారు. కాగా.. ఈ వివాదం చివరకు కోర్టు వరకు చేరింది. అయితే, కేసు వేసింది త్రిష కాదు. మన్సూర్ అలీ ఖాన్..! ఈ విలన్ ఈ మధ్యకాలంలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేసిన మన్సూర్ అలీ ఖాన్ పెద్ద రచ్చే చేశాడు.
BHOLA SHANKAR: రీ’మేకులు’.. 2023లో కలిసిరాని రీమేకులు..!
త్రిషతో తనకు రేప్ సీన్ లేనందుకు బాధపడుతున్నా అని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో చాలా మంది మన్సూర్ అలీ ఖాన్‌పై మండిపడ్డారు. త్రిష కూడా అతనితో ఇంకెప్పుడూ పని చేయను అని తేల్చి చెప్పేసింది. అలాగే త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌ను చాలా మంది ఖండించారు. చిరంజీవి, ఖుష్బూతో పాటు చాలా మంది.. మన్సూర్ అలీ ఖాన్‌ను విమర్శిస్తూ స్పందించారు. చిరంజీవి, లోకేష్ కనగరాజ్, ఖుష్బు, మాళవిక మోహనన్, నితిన్, చిన్మయి.. త్రిషకు సపోర్ట్‌గా నిలిచారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. అయితే, వివాదం ముదరడంతో ఆమెపై చేసిన వ్యాఖ్యలకు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. ఇక్కడే వివాదం కొత్త మలుపు తిరిగింది.
త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై పరువునష్టం దావా వేస్తానని మన్సూర్ ప్రకటించడం కోలివుడ్‌లో సంచలనం కలిగించింది. అన్నట్లుగానే చిరంజీవి, ఖుష్బూపై పరువు నష్టం దావా వేశాడు. చెరో కోటిరూపాయలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. మన్సూర్ అలీఖాన్‌కు మొట్టికాయలు వేసింది. ఈ పని పబ్లిసిటీ కోసం చేసినట్లుందని, పిటిషన్‌ను కొట్టేసింది కోర్టు. అంతే కాదు సమయం వృథా చేసినందుకుగానూ లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ సతీశ్ కుమార్ మన్సూర్‌ను ఆదేశించారు. దీంతో మన్సూర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.