Maha Bharath: వెబ్ సిరీస్ గా మహా భారతం.. డ్రీం ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ ఇచ్చిన జక్కన్న..
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పనితనం గురించి ఆయన సాధించిన విజయాలే మాట్లాడుతాయి. ఆయన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. రీసెంట్ గా తన డ్రీం ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాడు జెక్కన్న. ఆయన తీయబోతున్న మహాభారతం సినిమాను 10 పార్ట్ లుగా వెబ్ సిరీస్ ల తీసే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళిని ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ‘‘గతంలో మీరు ‘మహాభారతం’ తీస్తానని అన్నారు. అద్భుతమైన ఆ దృశ్య కావ్యం టెలివిజన్‌లో 266 ఎపిసోడ్స్‌గా ప్రసారమైంది. మీరు తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు’ అని ప్రశ్నించారు. ఇందుకు రాజమౌళి సమాధానం ఇస్తూ ‘నాకు కూడా తెలియదండీ. ఇది చాలా కష్టమైన ప్రశ్న.
ఒకవేళ ‘మహా భారతం’ తీయాలంటే భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలంటేనే ఏడాదిపైనే సమయం పట్టవచ్చు. అప్పటికి ఒక్క అక్షరం కూడా పేపర్‌పై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్టు. ‘మహాభారతం’ తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోనని నేను ఊహిస్తున్నా. అయితే, ఎన్ని భాగాలు అవుతుందో కచ్చితంగా చెప్పలేను’’ అని అన్నారు.
గతంలోనూ ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌పై రాజమౌళి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘చాలా పెద్దగా ఆ ప్రాజెక్టు చేయాలి. భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలి. ‘మహాభారతం’ నా చిరకాల ప్రాజెక్ట్. అయితే, ఆ మహాసముద్రంలోకి అడుగు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. అంతకన్నా ముందు నాలుగైదు సినిమాలు తీస్తానేమో’’ అని అన్నారు. ప్రస్తుతం ఎలాంటి అవాంతరాలు లేకుండా రాజమౌళి ఒక సినిమా తీయాలంటే దాదాపు మూడేళ్లు పైనే పడుతుంది. ఈ లెక్కన ఆయన మహాభారతం తీయడానికి ఇంకో 10, 12ఏళ్లు పైనే పట్టవచ్చు. అంటున్నారు ఫాన్స్.