మహేష్, ప్రియాంకా పాస్పోర్టులు సీజ్ చేసిన జక్కన్న

టాలీవుడ్ లో క్రేజీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఒక వీడియో షేర్ చేసిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2025 | 09:54 AMLast Updated on: Jan 27, 2025 | 9:54 AM

Mahesh And Priyankas Passports Were Seized By Jakkana

టాలీవుడ్ లో క్రేజీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఒక వీడియో షేర్ చేసిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సింహన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. పాస్పోర్ట్ చూపిస్తూ ఒక ఫోటోకు రాజమౌళి ఫోజు ఇచ్చారు. దీనితో మహేష్ బాబు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని ఇప్పటిలో మహేష్ బాబుకి అబ్రాడ్ వెకేషన్స్ లేవు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక రాజమౌళి పోస్టుకు మహేష్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు.

దీని పైన నమ్రత కూడా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను రాజమౌళి ఫైనల్ చేసేసారు. ఈ సినిమా విషయంలో ప్రియాంక చోప్రా ముందు నుంచి అటు ఇటుగా ఉన్న రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక రాజమౌళి లుక్ టెస్ట్ కూడా ఆమెకు కంప్లీట్ చేసేసారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆ సెట్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం రాత్రి రాజమౌళి ఈ పోస్ట్ చేయగా శనివారం ఉదయానికి అది భీభత్సంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన పోస్ట్లు మీమ్స్ కనపడుతున్నాయి. ఇక మరి కొంతమంది అయితే దీనిపై ఇంట్రెస్టింగ్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

రాజమౌళి సినిమా అంటే మహేష్ బాబు ఆ సినిమా కంప్లీట్ అయ్యేవరకు మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. అంతలా డెడికేటెడ్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు గ్యాప్ వస్తే విదేశాలకు వెకేషన్ కు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం రాజమౌళి ఏంటి చెప్తే అటు వెళ్లాల్సిందే. అందుకే మహేష్ బాబు పాస్పోర్ట్ లాగేసుకున్నాడట జక్కన్న. అలాగే ప్రియాంక చోప్రా పాస్పోర్ట్ కూడా లాక్కుని తన వద్దనే ఉంచుకున్నాడట. రాజమౌళి సినిమా అంటే అటు టెక్నీషియన్లు కూడా మరో సినిమా ఓకే చేయడానికి ఛాన్స్ ఉండదు. ఇక నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను ఆఫ్రికా కూడా తీసుకెళ్లి షూటింగ్ లొకేషన్స్ చూపించారు రాజమౌళి.