1500 కోట్లంటే ఫ్యాన్స్ కి పండగ… 2028 నెంబర్ అంటేనే వణుకు..?
బాహుబలి పుణ్యామాని 4 ఏళ్లు సెట్స్ కే పరిమితం అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. త్రిబుల్ ఆర్ వల్ల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ చరణ్ కూడా 3 ఏళ్లు త్రిబుల్ ఆర్ కే అంకితమయ్యారు.
బాహుబలి పుణ్యామాని 4 ఏళ్లు సెట్స్ కే పరిమితం అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. త్రిబుల్ ఆర్ వల్ల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ చరణ్ కూడా 3 ఏళ్లు త్రిబుల్ ఆర్ కే అంకితమయ్యారు. ఇక తర్వాత సూపర్ స్టార్ తో రాజమౌళి సినిమా అంటే, కనీసం రెండు లేదంటే మూడు నాలుగేళ్లు సెట్స్ కే మహేశ్ బాబు పరిమితమంటూ కామెంట్లొచ్చాయి. ఒక వైపు రాజమౌళి మేకింగ్ లో మహేశ్ బాబు మూవీ అంటే పాన్ వరల్డ్ గేట్లు తెరుచుకుంటాయని ఫ్యాన్స్ సంబరపడ్డా.. ఎక్కడ వాళ్ల అభిమాన హీరో ఏళ్లకు ఏళ్లు సెట్స్ కే పరిమితమౌతాడో అన్న టెన్షన్ పట్టుకుంది. ఐతే అచ్చంగా వాళ్ళేదైతే జరుగుతుందో అని టెన్షన్ పడ్డారో, అదే జరిగేలా ఉంది. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమా ని చూసి గర్వపడాలో, 2028 అన్న ఒక్క నెంబర్ వినగానే ఉలిక్కిపడాలో అర్ధం కానిపరిస్థితి… మొత్తానికి రూమర్లే నిజమౌతున్న వేళ, సూపర్ స్టార్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?
రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు మూవీ 1500 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశారు. అంతే అంతకుమించి మరో అప్ డేట్ లేదు. ఏడాదిగా కథా చర్చలు, మలేషియా, ఇండోనేషియా నటి అంటూ పుకార్లు తప్ప ఇంతవరకు ఎలాంటి ఎనౌన్స్ మెట్ లేదు. కట్ చేస్తే 2028 అన్న నెంబర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని నిజంగా భయపెట్టేలా ఉంది
ఎందుకంటే, ఈ సినిమా 2028 లోనే వచ్చే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఈఏడాది ఎండ్ లో లేదా, వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా లాంచ్ అవుతుంది. సమ్మర్ నుంచి షూటింగ్ జరుగుతుందని చాలా వార్తలొచ్చాయి…
కాని ఈలోపే 40శాతం సీన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో షూటింగ్ చేసి, ఆ శాంపిల్ వీడియోతో ఏఐ ఎలా వర్క్ చేస్తుందో, టోటల్ టీం కి నేర్పిస్తున్నాడు రాజమౌళి. ఈ వర్క్ షాప్ కనీసం రెండు నెలలు నడుస్తుందట.
ఈ మూవీలో 70శాతం విజువల్ ఎఫెక్ట్స్ ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతోనే రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతవరకు ఈ టెక్నాలజీతో ఒకటీ రెండు హాలీవుడ్ సైఫై ఫిక్షన్ మూవీలొచ్చాయి. అవి కూడా 99 శాతం యానిమేటెడ్ వర్షనే.. కాని ఫస్ట్ టైం రియల్ క్యారెక్టర్స్ కి ఏఐని అప్లై చేసి, పాన్ వరల్డ్ స్కేల్ తో సినిమా తీస్తున్నారు. అందుకే ఈ సినిమా 2025 లో మొదలైనా 2028 లోనే వచ్చే అవకాశాలున్నాయి
అంటే అవతార్ మూవీ షూటింగ్ కి ముందే చాలా వరకు గ్రాఫిక్స్ లో డెవలప్ చేసిన యానిమేటెడ్ వరల్డ్ ని సెట్ చేసి, తర్వాత షూటింగ్ చేశారు. అలానే మహేశ్ బాబు మూవీలో వాడే గ్రాఫిక్ వరల్డ్ ని ముందుగానే డిజైన్ చేసి, దాన్ని కెమెరాకు అనుసందానం చేస్తారు. సో షూటింగ్ టైంలోనే హీరో గ్రీన్ మ్యాట్ లో ఉంటే, మానిటర్ లో హీరో చుట్టూ దర్శకుడు క్రియేట్ చేసిన నేచరే ఉంటుంది…
ఇలాంటి టెక్నాలజీతో సినిమా అంటే, ఒకే మూవీ రెండు మూడు సార్లు తీసనంత పనౌైతుందట. అలాని ఈ మూవీకి రెండు భాగాలుంటాయా అంటే అది లేదు.. ఒకే సినిమాను, ఇంత వ్యయ ప్రయాసతో తీస్తున్నారు. కారణం కొత్త టెక్నాలజీనీ ఈరేంజ్ లోవాడుతున్నారు కాబట్టి…. టైం పట్టేలా ఉంది. సో పాన్ వరల్డ్ మూవీ తో రాబోతున్న మహేశ్ బాబు ని చూసి గర్వించే ఫ్యాన్స్ కి మాత్రం ఒక రకంగా మరో 4 ఏళ్ల వరకు మహేశ్ మూవీ రాదనే భయం గట్టిగానే వెంటాడుతోంది.