SSMB 29 : ‘మహారాజా’ గా మహేష్… జక్కన్న ప్లాన్ వేరే లెవెల్..

మహేష్‌-రాజమౌళి (Mahesh - Rajamouli) ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో మహేష్‌, రాజమౌళి కాంబో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) సెట్స్ పైకి వెళ్లనుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 02:39 PMLast Updated on: Feb 16, 2024 | 2:39 PM

Mahesh As Maharaja Jakkannas Plan Is A Different Level

మహేష్‌-రాజమౌళి (Mahesh – Rajamouli) ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో మహేష్‌, రాజమౌళి కాంబో వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) సెట్స్ పైకి వెళ్లనుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రజెంట్ రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. నటీనటుల ఎంపిక చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో పలువురు స్టార్స్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండగా… మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌గా ఎస్ఎస్ఎంబీ 29 నిలవబోతోంది. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే మహేశ్​ కూడా తన లుక్స్​ను, శరీరాకృతిని మార్చేశారు. ఫారెన్ వెళ్లి మరీ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ మూవీని ఎక్కడ రాజీ పడకుండా ఫుల్ ప్లాన్డ్​గా ఉన్న జక్కన్న ఇప్పుడో కొత్త డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా రాజమౌళి తన మొత్తం టీమ్​ను మార్చబోతున్నట్లు ఓ న్యూస్ జోరుగా వినిపిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణిని తప్ప ఇతర టీమ్​ను జక్కన్న మార్చేశారట. ఈ సారి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్​గా, ఆర్సి కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్​వైజర్​గా, తమ్మి రాజు ఎడిటర్​గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్​గా, రాజమౌళి సతీమణి రమ కాస్ట్యూమ్ డిజైనర్​గా బాధ్యతలు చూసుకోనున్నారట. ఇండోనేషియాకు చెందిన ఓ నటి హీరోయిన్​గా నటించనుందని అంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. తాజాగా ఈ మూవీ వర్కింగ్ టైటిల్ ను కూడా మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా థియేటర్ టైటిల్ ఖరారు చేయని జక్కన్న (Jakkanna) ప్రాజెక్టును మొదటి నుంచి SSMB29 అనే పిలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు దర్శదీరుడు… ‘మహారాజా’ (Maharaja) అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నాడట. ఇది అన్ని భాషలకూ సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతోనే దీన్ని ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మహేష్ విషయంలో అదే ఫాలో అవుతున్నాడు. అయితే మహారాజ్ టైటిల్ పై త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. మరోవైపు ఈ టైటిల్ విన్న మహేష్ ఫ్యాన్స్ చాలా బాగుందంటూ కామెంట్స్ పెట్టడంతో పాటు దీనినే ఫిక్స్ చేయాలని రిక్వెస్ట్ లు పెడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..