రెబల్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్… రెబల్ చర్యలు ఊహాతీతం…

రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మరో స్టార్ వెండితెరని పంచుకుంటే.. గతంలో రానా విలన్ గా బాహుబలిలో కనిపించాడు... సలార్ లో ఫ్రుథ్వీరాజ్ అలానే షాక్ ఇచ్చాడు. ఇక కల్కీలో అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వద్దామగా ప్రభాస్ తో కలిసి ఫైట్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 08:14 PMLast Updated on: Sep 09, 2024 | 8:14 PM

Mahesh Babu Act In Prabhas Movie

రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి మరో స్టార్ వెండితెరని పంచుకుంటే.. గతంలో రానా విలన్ గా బాహుబలిలో కనిపించాడు… సలార్ లో ఫ్రుథ్వీరాజ్ అలానే షాక్ ఇచ్చాడు. ఇక కల్కీలో అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వద్దామగా ప్రభాస్ తో కలిసి ఫైట్ చేశాడు. ఇలాంటి కాంబినేషన్ లు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చూశారు. ఇప్పుడు అంతకి మించేలా మరో కాంబినేషన్ రాబోతోంది. రెబల్ స్టార్ తో సూపర్ స్టార్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది… ఇంతవరకు జరగనిది… ఎవరి ఊహకు అందనిది… జరగబోతోంది.. ఎప్పుడు? ఎందులో?

ప్రభాస్ అంటేనే బాక్సాఫీస్ బాద్ షా… బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ని కూడా బీట్ చేసి పాన్ ఇండియా కింగ్ గా బాక్సాఫీస్ ని కబ్జా చేశాడు. అలాంటి తను సలార్, కల్కీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రాజా సాబ్ తో సమ్మర్ మీద దాడికి రెడీ అయ్యాడు. అయితే ఫౌజీ తోపాటు, స్పిరిట్ మూవీలకు కూడా కమిటైన ప్రభాస్ ఇప్పుడు సూపర్ స్టార్ తోస్క్రీన్ షేర్ చేసుకోవటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఇక ఎనౌన్స్ మెంట్ మాత్రమే బాఖీ అని తెలుస్తోంది

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో కీరోల్ వేయబోతున్నాడు. ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ వీకే ఇది ఫైనలైంది. కాకపోతే దసరాకు స్పెషల్ గా ఎనౌన్స్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. కాని ఈ కాంబినేషన్ సలార్ సీక్వెల్ లో సాధ్యమయ్యేలా ఉందట. ఐతే ప్రశాంత్ నీల్ ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ ప్లాన్ చేశాడు.

ఆల్రెడీ రెగ్యులర్ షూటింగ్ తాలూకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. వన్స్ దేవర విడుదలైందంటే, అక్టోబర్ నెల మధ్యలోడ్రాగన్ షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.ఇలాంటి టైంలో సలార్ 2 కి ఛాన్సే లేదు. ఎలాచూసినా ప్రభాస్ రాజా సాబ్ ని పూర్తి చేయాలి. మరో వైపు హను రాఘవపూడీ మూవీ ఫౌజీ కంప్లీట్ చేయాలి.. దీనికి తోడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ ఇంకా పట్టాలే ఎక్కలేదు. ఇవన్నీ అవ్వకముందే సలార్ సీక్వెల్ సెట్స్ పైకెళ్లే ఛాన్స లేదు..

కాని ఈలోపే సలార్ 2 లో శౌర్యాంగ పర్వంలో ప్రభాస్ తండ్రిగా మోహన్ లాల్ కనిపించబోతున్నాడనే ప్రచారం మొదలైంది. దీంతో మరి ఎన్టీఆర్ మూవీ సగం పూర్తయ్యాక, ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మూవీ ప్యార్ లల్ గా తెరకెక్కుతుందా అన్న డౌట్లు పెరిగాయి. స్పిరిట్, సలార్ 2 ప్యార్ లల్ గా షూటింగ్ చేసే ఛాన్స్ చాలా వరకు ఉంది… కాబట్టే మోహన్ లాల్ తో ప్రశాంత్ నీల్ చర్చలు ఫలించాయనగానే, సలార్ 2 తాలూకు రకరకాల గుసగుసలు పెరిగాయి.