MAHESH BABU: వెంకీ మామ కూతురు పెళ్లిలో.. మహేష్‌ ఫ్యామిలీ సందడే సందడి..

రామానాయుడు స్టూడియోస్‌లో నభూతో అనే రేంజ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. హవ్యవాహిని మెహందీ వేడుక అద్భుతం అనిపించింది. ఈ వేడుక‌ల్లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు కూతురు సితార సహా పలువురు సినీ ప్రముఖులు సంద‌డి చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 04:58 PMLast Updated on: Mar 15, 2024 | 4:58 PM

Mahesh Babu And Family In Venkatesh Daughters Marriage

MAHESH BABU: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని పెళ్లి వేడుక‌లు ఘ‌నంగా జరుగుతున్నాయ్. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ ఫ్యామిలీతో.. వెంకటేష్ వియ్యం అందుకుంటున్నాడు. రామానాయుడు స్టూడియోస్‌లో నభూతో అనే రేంజ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. హవ్యవాహిని మెహందీ వేడుక అద్భుతం అనిపించింది. ఈ వేడుక‌ల్లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు కూతురు సితార సహా పలువురు సినీ ప్రముఖులు సంద‌డి చేశారు.

PRABHAS: మహేశ్, పవన్‌ను కూడా మించిపోయిన రెబల్ స్టార్

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ సోష‌ల్ మీడియాలో పంచుకుంది. బ్లాక్ డ్రెస్‌లో సితార పాప క్యూట్‌గా ఉంటే.. నమ్రతా శిరోద్కర్‌ మెరిసిపోయింది. మెహందీ వేడుకలో తల్లీకూతుళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు వెంకీ మామ ఫ్యాన్స్‌.. ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. హీరో వెంకటేష్‌కు నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు. ఒక కొడుకు అర్జున్. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల కింద జరిగింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో హవ్యవాహిని నిశ్చితార్థం నిర్వహించారు.

ఈ వేడుకు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, సహా పలువురు రాజ‌కీయ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇప్పుడు పెళ్లి వేడుకకు కూడా.. సెలబ్రిటీలు భారీగా హాజరుకాబోతున్నారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ మ్యారేజ్‌లో సందడి చేసే అవకాశాలు ఉన్నాయ్.