Koratala Siva: శ్రీమంతుడు కాపీ వివాదం.. కొరటాల శివకు ఇబ్బందులు తప్పవా..?
తెరవెనక శరత్ చంద్రకి 15 లక్షల వరకు డబ్బిచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకునే ప్రయత్నం జరిగిందనే మాట వినిపిస్తోంది. కానీ, రైటర్ శరత్ చంద్ర.. తనకి డబ్బొద్దు, శ్రీమంతుడు కథ తాలూకు క్రెడిట్ ఇస్తే చాలానటం అందర్ని ఆశ్చర్య పరుస్తోంది.

Koratala Siva: కొరటాల శివ టీం.. శ్రీమంతుడి కథకి, శరత్ చంద్ర రాసిన కథకి పోలికలున్నాయో లేవో, మీరే చూసి తేల్చుకోండి అనే అర్ధం వచ్చేలా స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ, తెరవెనక శరత్ చంద్రకి 15 లక్షల వరకు డబ్బిచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకునే ప్రయత్నం జరిగిందనే మాట వినిపిస్తోంది. కానీ, రైటర్ శరత్ చంద్ర.. తనకి డబ్బొద్దు, శ్రీమంతుడు కథ తాలూకు క్రెడిట్ ఇస్తే చాలానటం అందర్ని ఆశ్చర్య పరుస్తోంది.
Ambajipeta Marriage Band: పెర్ఫామెన్స్‌తో దుమ్ముదులిపిన హీరో సుహాస్
ఎప్పుడో రిలీజైన మూవీకి ఇప్పుడు క్రెడిట్ ఇస్తే పెద్దగా ప్రయోజనం ఏముండదు. కాకపోతే ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి, మరో కథ పట్టుకుని మరో హీరోని కలవటానికి ఈ గుర్తింపు సరిపోతుంది. ఆ గుర్తింపు ఈపాటికే వచ్చింది కాబట్టి, శరత్ చంద్ర కొరటాల శివ ఆఫర్‌కి ఒప్పుకుంటే పెద్ద మొత్తంగా డబ్బు రావొచ్చంటున్నారు. కాని ఈ రైటర్ అందుకు నో అనటంతో కొరటాల శివకి కష్టాలు తప్పేలా లేవు. నాంపల్లి కోర్టులో కొరటాల శివదే తప్పని తేలితే, ఇక తన కెరీర్‌కి చాలా వరకు ఫుల్ స్టాప్ పడినట్టే అంటున్నారు.
దీనికి తోడు తను తీస్తున్న దేవర మూవీ మార్కెట్‌ని కూడా ఈ అంశం ఇబ్బందిపెట్టే ఛాన్స్ఉంది. మొత్తంగా కోర్టు బయట సెటిల్ కాకపోతే, శ్రీమంతుడు వివాదం కొరటాల భవిష్యత్తునే లాగేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.