Prabhas: ప్రభాస్, మహేశ్ తో డబుల్ గేమ్ ఆడుతున్న దర్శకులు..
ప్రభాస్ తో డబుల్ గేమ్స్ మజాక్ కాదు.. మహేశ్ తో కూడాడబుల్ గేమ్స్ తమాషా కాదు.. కాని అదేజరుగుతోంది. ఇందులో ఫ్యాన్స్ సంబురపడే అంశమే తప్ప మరోకటి లేదు. ప్రాజెక్ట్ కే పార్ట్ 2 ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రభాస్ ఒకటి కాదు, రెండు కాదు మూడు సినిమాలు సీక్వెల్స్ రూపంలో కిక్ ఇవ్వబోతున్నాయి.

Mahesh Babu and Prabhas are ready to make films called Part One and Part Two
ప్రాజెక్ట్ కే , సలార్ రెండూ కూడా రెండు భాగాలుగా వస్తాయని అంతా అనుకున్నదే, సీజ్ ఫైర్ పార్ట్ 1 అన్నాడు కాబట్టి సలార్2 ఉందని అఫీషియల్ గా తేల్చినట్టే. ఐతే ప్రాజెక్ట్ కే మాత్రమే రెండో భాగం ఉందని తేలాలి. అదే ఈనెల 20న యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో తేలబోతోంది.
ప్రాజెక్ట్ కే టైటిల్ తోపాటు గ్లింప్స్ ని అలానే పార్ట్ 2 టైటిల్ ని కూడా ఈనెల 20న ఎనౌన్స్ చేయబోతోంది నాగ్ అశ్విన్ టీం.స్పిరిట్ ని సందీప్ రెడ్డి వంగ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడని ప్రచారం పెరుగుతోంది. ఇక మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో తేల్చాడు.
అలానే మెగాస్టార్ చిరంజవితో బింబిసార ఫేం వశిష్ట, తీసే ముల్లోక వీరుడు రెండు భాగాలుగా తెరకెక్కనుందట. శంకర్ దాదా ఎంబీబీఎస్, జిందాబాద్ అంటూ ఆఫార్ములాతో ట్రెండ్ సెట్ చేసిన చిరు నుంచి, ప్రభాస్ వరకు అరడజన్ హీరోలు డబుల్ ధమాకాకి రెడీ అయ్యారు.