MAHESH BABU: మహేశ్ బాబు గడ్డంతో రాజమౌళి షాక్ ఇచ్చేస్తున్నాడా..?

కొన్ని సార్లు గుసగుసలు నిజం అవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. రాజమౌళి మూవీ కోసం జర్మనీ అడవుల్లో వాతావరణం అలవాటు చేసుకుంటూనే, కండలు పెంచే కోర్స్ చేస్తూ, కత్తి యుద్దాలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పని చేశాడు మహేశ్ బాబు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2024 | 05:23 PMLast Updated on: Feb 05, 2024 | 5:23 PM

Mahesh Babu And Rajamouli Film Mahesh With Beard Look

MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు గెడ్డం లుక్ అదిరింది. అప్పుడెప్పుడో టక్కరిదొంగలో ఇలా గడ్డంలుక్‌లో కనిపించాడు. గుంటూరు కారంలో గడ్డం ఉంది. భరత్ అనే నేనులో ఓ పాటకోసం తను మీసం అతికించుకోవాల్సి వచ్చింది. రెండూ వేరు. ఇప్పుడు తను గెడ్డం, మీసంతో కనిపిస్తున్న లుక్‌లో ఉన్న కిక్ వేరు. ఆ ఒక్క లుక్‌తో రాజమౌళి మూవీలో మహేశ్ బాబు ఎలా ఉండబోతున్నాడో, తన పాత్ర ఏంటో ఇప్పటి వరకు వినిపించిన పుకార్లలో నిజం ఎంతో తేలిపోయింది.

JANASENA: పొత్తులో జనసేనకు దక్కబోయే స్థానాలు ఇవేనా..?

కొన్ని సార్లు గుసగుసలు నిజం అవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. రాజమౌళి మూవీ కోసం జర్మనీ అడవుల్లో వాతావరణం అలవాటు చేసుకుంటూనే, కండలు పెంచే కోర్స్ చేస్తూ, కత్తి యుద్దాలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పని చేశాడు మహేశ్ బాబు. అయితే తన గెడ్డం, మీసం లుక్‌తో నిజంగానే టక్కరిదొంగలో తన పాత్ర లుక్‌నే రాజమౌళి కోరుకున్నట్టు, మహేశ్ కూడా అందుకు తగ్గట్టే రెడీ అవుతున్నట్టు తేలింది. వస్తున్న పుకార్ల పరంగా చూస్తే, రాజమౌలి మూవీలో కూడా టక్కరి దొంగలో వేసిన కౌబాయ్ రోలే వేయబోతున్నాడట మహేశ్.

తల్లి ఇండియన్, తండ్రి అమెరికన్ అవటం, తండ్రి బాటలోనే కౌబాయ్‌గా ఉండే తను, అడవిలో అద్భుతాలను వేటాడటం, కాపాడటం లాంటి సాహస యాత్రకు బయలు దేరాల్సి వస్తుందట. ఇదే పుకారుని తన గెడ్డం, మీసం లుక్ నిజం చేస్తోంది.