Mahesh Babu: మహేష్‌తో జక్కన్న మరో బాహుబలి.. రెండు పార్టులంటూ ట్విస్ట్
రెండు పార్ట్‌లుగా సినిమా అంటే ఖచ్చితంగా చాలా లేట్ అవుతుంది. ఈ కారణంగానే మహేష్ ఏకంగా నాలుగు సంవత్సరాలు రాజమౌళి సినిమాకు కేటాయించాడు. బాహుబలితో వండర్స్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ మళ్లీ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి దిమ్మతిరిగిపోయే అప్‌డేట్ వచ్చింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ లీక్ ఇచ్చారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. సినిమాలో ఫస్ట్ పార్ట్‌కు సెకండ్ పార్ట్‌కు కథ పరంగా కాస్త తేడా ఉన్నా.. క్యారెక్టర్లు మాత్రం అలాగే కొనసాగుతాయంటూ చెప్పారు. ఈ సినిమాలో ప్రతీ సీన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా షూట్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారట. సినిమాలో ఒక్క సెకన్ కూడా ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుడా ఉండేలా సినిమాను రాజమౌళి డిజైన్ చేస్తున్నారంటూ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమా ఆడియన్స్‌కు ఓ అడ్వెంచర్‌లా ఉండబోతోందంటూ అంచనాలు భారీగా పెంచేశారు. 2024 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
రెండు పార్ట్‌లుగా తీసిన బాహుబలి సినిమాతో.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు జక్కన్న. ఇప్పుడు మహేష్‌తో కూడా మరోసారి రెండు పార్టులుగా సినిమా తీస్తున్నాడంటే.. ఆడియన్స్‌లో అంచనాలు మామూలుగా ఉండవు. బాహుబాలి రికార్డ్‌ను మళ్లీ తానే బ్రేక్ చేయబతున్నాడంటూ అప్పుడే ఆడియన్స్‌లో డిస్కషన్ కూడా మొదలైంది. సాధారణంగానే సినిమాలు చాలా ఆలస్యంగా తీస్తుంటాడు రాజమౌళి. సినిమాలో ఏ సీన్ దగ్గరా ఆయన కాంప్రమైస్ కారు. తనకు నచ్చినట్టు సీన్ వచ్చే వరకూ షూట్ చేస్తూనే ఉంటాడు. ఇక రెండు పార్ట్‌లుగా సినిమా అంటే ఖచ్చితంగా చాలా లేట్ అవుతుంది. ఈ కారణంగానే మహేష్ ఏకంగా నాలుగు సంవత్సరాలు రాజమౌళి సినిమాకు కేటాయించాడు. బాహుబలితో వండర్స్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ మళ్లీ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.