MAHESH BABU: మహేశ్ బాబు, రణ్‌బీర్‌కు ట్రైనింగ్ అవసరమా?
1500 కోట్లతో మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో రాముడి పాత్ర కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట రణ్‌బీర్ కపూర్. అసలు నాన్ వెజ్ తినకుండా, ఆల్కహాల్, సిగరెట్ లాంటి వాటి జోలికి పోకుండా, విలు విద్య నేర్చుకునే పనిలో పడ్డాడు రణ్‌బీర్ కపూర్.
MAHESH BABU: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా రామాయణం తెరకెక్కబోతోంది. సీతగా సాయిపల్లవి, రావణుడిగా కేజీయఫ్ ఫేం యష్ కనిపించబోతున్నారు. దంగల్ డైరెక్టర్ నితీష తివారి మేకింగ్‌లో ఇది తెరకెక్కబోతోంది. అంతా బానే ఉంది. ఐతే 1500 కోట్లతో మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో రాముడి పాత్ర కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట రణ్‌బీర్ కపూర్. అసలు నాన్ వెజ్ తినకుండా, ఆల్కహాల్, సిగరెట్ లాంటి వాటి జోలికి పోకుండా, విలు విద్య నేర్చుకునే పనిలో పడ్డాడు రణ్‌బీర్ కపూర్.
KALKI 2898 AD: గ్రాఫిక్స్ విషయంలో కల్కిని మించేలా రాజా సాబ్?
ఇది ఎలా ఉందంటే, బాహుబలి తీసే టైంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఎలా కత్తి యుద్ధాలు, మల్లయుద్ధాలు నెలల తరబడి నేర్చుకున్నారో.. అలానే రణ్‌బీర్ కపూర్ నేర్చుకోబోతున్నాడట. ఒక సినిమాలో పాత్ర కోసం నటులు ట్రైనింగ్ తీసుకోవటం కొత్త కాదు. కానీ, పర్పెక్షన్ కోసం నెలల తరబడి ట్రైనింగ్ తీసుకునే విధానం మాత్రం ఈగ, బాహుబలితోనే తీసుకొచ్చాడు రాజమౌళి. రౌడీ స్టార్ విజయ దేవరకొండ కూడా లైగర్ కోసం 6 నెలలు తైక్వాండో నేర్చుకున్నాడు. అయితే, రిజల్ట్ రివర్స్ అవటంతో ఫలితం లేకుండాపోయింది.
మహేశ్ బాబు మాత్రం మూడు నెలల క్రాష్ కోర్స్ కోసం సిద్దమయ్యాడు. రాజమౌళి మూవీ కోసం జర్మనీలో ఓ సెషన్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారి.. ఇలా చాలా విషయాల్లో తను ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు. మొత్తంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీల్లో నటించే స్టార్లకు దంగల్ రేంజ్‌లో ట్రైనింగ్ అవసరం అవుతోంది.