Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్‌ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..

అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న గేమ్‌ ఈవెంట్‌లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్‌గా డ్యాన్సులు చేశారు. పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2024 | 02:24 PMLast Updated on: Apr 01, 2024 | 2:25 PM

Mahesh Babu And Sreeleelas Kurchi Madathapetti From Guntur Kaaram Played At Nba Halftime

Kurchi Madathapetti: ఏదేమైనా మన సినిమాలకు, సినిమా పాటలకు అంతర్జాతీయంగా జనం ఫిదా అయిపోతున్నారంటే ప్రతి తెలుగోడూ గర్వ పడతాడు. మొన్నటి వరకు ఆస్కార్‌ దక్కించుకున్న నాటు నాటు పాటకు ఇంగ్లీషోళ్లు కూడా స్టెప్పులేశారు. ఇప్పుడు మళ్లీ కుర్చీని మడత పెట్టి పాట ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లో జరుగుతున్న గేమ్‌ ఈవెంట్‌లో కుర్చీని మడత పెట్టి పాటకు చిన్నారులు స్టైలిష్‌గా డ్యాన్సులు చేశారు.

AP Volunteers: ఏపీలో ఫించన్లు ఆపిందెవరు..? అసలేం జరిగింది..?

పెద్ద స్టేడియంలో జరుగుతున్న ఈ షోలో మన తెలుగు పాటకు అక్కడి వారంతా ఉర్రూతలూగారు. అందులో పిల్లలంతా కుర్చీని మడత పెట్టి పాటకు తమదైన స్టైల్‌లో చిందులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాట వినపడుతున్నంత సేపు ఆ ప్రాంతం అంతా హుషారెత్తిపోయింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. మహేష్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని ఈ పాట కొద్ది రోజుల్లోనే నెట్‌లో వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు కూడా దీనితో రీల్స్‌ చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు కూడా దీనికి రీల్‌ చేసి అప్‌లోడ్‌ చేశారు.

ఇంతగా వైరల్‌ అయిన ఈ ‘కుర్చీని మడత పెట్టిపాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది అనడానికి ఈ డ్యాన్స్‌ షోయే నిదర్శనం అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. తమ అభిమాన నటుడు మహేష్‌ బాబు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.. అంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద అమెరికన్‌ వేదికపై మన తెలుగు పాట మోగడం అంటే ఆషామాషీ కాదంటూ ఆనందించేస్తున్నారు.