Mahesh Babu: మ‌హేశ్ ఇక లాక్ అయిపోయినట్లేనా..? డేట్ ఫిక్స్‌..

ఈ మూవీ లాంచింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న.. ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ టాక్ టాలీవుడ్ స‌ర్కిల్‌లో స‌ర్క్యూలేట్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 23, 2024 | 01:27 PMLast Updated on: Jan 23, 2024 | 1:27 PM

Mahesh Babu And Ss Rajamouli Movie Will Starts On Ugadi This Year

Mahesh Babu: ఆర్ఆర్ఆర్ సినిమా స‌క్సెస్ త‌రువాత టాలీవుడ్‌లోనే కాదు వ‌రల్డ్ వైడ్‌గా రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రంపై ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఇక‌.. జ‌క్క‌న్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో ఉండ‌డంతో ఆ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. పాన్ వ‌రల్డ్‌ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని మ‌హేష్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విషయాలు జ‌క్క‌న్న ఎప్పుడు చెబుతారా అని క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు.

Ayodhya, Alia saree : ఆలియా చీర కొంగులో రామాయణం…అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ

ఈ టైమ్‌లోనే ఈ మూవీ లాంచింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న.. ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ టాక్ టాలీవుడ్ స‌ర్కిల్‌లో స‌ర్క్యూలేట్ అవుతోంది. దీంతో.. ఈ మూవీకి ఎప్పుడెప్పుడు కొబ్బ‌రి కాయ కొడ‌తారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బిగ్ రిలీఫ్ దొరికిన‌ట్ల‌య్యింది. ఈ డేట్‌ను ఇప్పుడు మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. మ‌హేశ్- జ‌క్క‌న్న కాంబో.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ భారీ బ‌డ్జెట్‌తో, యూనివ‌ర్సల్ కాన్పెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్‌గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. దీంతో.. ఈ మూవీ స్టోరీ ఏ రేంజ్‌లో ఉండ‌నుందా అన్న అంచ‌నాలు పెరిగిపోయాయి.

ఇండియానా జోన్స్ త‌ర‌హాలో భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ మూవీగా దీన్ని తెర‌కెక్కించ‌నున్నారు. స్క్రిప్ట్ ప‌నులు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయి. ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇక‌.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయారు. కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులే రాజమౌళి ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో రాజమౌళి తర్వాత సినిమా ఏమిటా..? అనే ఆసక్తి పెరిగిపోయింది. పైగా.. మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని, హాలీవుడ్ నటీనటులు కూడా ఉంటారన్న టాక్ ఈ మూవీ రేంజ్‌ను ఎక్కడికో తీసుకు వెళ్లిపోయాయి.