MAHESH BABU-SS RAJAMOULI: బాక్సాఫీస్ వేట.. మహేష్‌ బాబు, రాజమౌళి టైం వచ్చేసింది

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు జక్కన్న. మహేష్‌ బాబు బాడీ బిల్డప్ చేసే పనిలో ఉన్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. మహేష్ బాబు ఊహించని లుక్‌లో కనిపించబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2024 | 03:28 PMLast Updated on: Apr 19, 2024 | 3:28 PM

Mahesh Babu And Ss Rajamouli Pre Production Work Started

MAHESH BABU-SS RAJAMOULI: ఘట్టమనేని అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. దర్శకు ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌ బాబు బాక్సాఫీస్ వేట మొదలైంది. గత దశాబ్దకాలంగా ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్, రాజమౌళి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు జక్కన్న.

Chilukuru Balaji : గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా

మహేష్‌ బాబు బాడీ బిల్డప్ చేసే పనిలో ఉన్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. మహేష్ బాబు ఊహించని లుక్‌లో కనిపించబోతున్నాడు. గత కొన్ని రోజులుగా సరికొత్త లుక్ ట్రై చేస్తున్న మహేష్ బాబు.. తాజాగా అందుకు సంబంధించిన కొత్త లుక్‌లో కనిపించాడు. మహేష్‌తో పాటు రాజమౌళి, నిర్మాత కెఎల్ నారాయణ.. దుబాయ్ నుండి తిరిగి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇక ఈ నయా లుక్‌లో మహేష్ బాబు మామూలుగా లేడనే చెప్పాలి. డైనమిక్‌ అండ్‌ డాషింగ్‌ లుక్‌లో కనిపించాడు మహేష్. కాకపోతే క్యాప్‌ పెట్టుకున్నాడు. అయినా కూడా.. గుబురు గడ్డంతో, లాంగ్ హెయిర్‌తో సింహంలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక్కడి నుంచి ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ స్పీడప్ అయిందనే చెప్పాలి. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చినట్టేనని అంటున్నారు. త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్‌ ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌.. ఈ ముగ్గురు కలిసి ఒకేచోట కనిపించబడంతో.. మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.