MAHESH BABU: మహేశ్.. రాజమౌళి సినిమా పనులు షురూ.. షూటింగ్ ఎప్పటినుంచంటే..
జనవరి 20కి మహేశ్ రాజమౌళి మూవీ తాలూకు ఆఫీస్ ఓపెన్ కానుంది. ఆల్రెడీ రమా రాజమౌళితో కలిసి జక్కన్న తన కొత్త సినిమాలో పాత్రలకు కావాల్సిన కాస్ట్యూమ్ డిజైన్ వర్క్మ మొదలు పెట్టాడు.

Rajamoulis movie in the same backdrop SSMB29
MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న గుంటూరుకారం షూటింగ్ పూర్తైంది. పెండింగ్ సాంగ్ షూటింగ్ ని కూడా పూర్తి చేశాడు మాటల మాంత్రికుడు. జనవరి 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక జనవరి 20 నుంచి రాజమౌళి మేకింగ్ లో మహేశ్ బాబు మూవీ తాలూకు అసలు పనులు మొదలు కానున్నాయి. జనవరి 20కి మహేశ్ రాజమౌళి మూవీ తాలూకు ఆఫీస్ ఓపెన్ కానుంది.
Ranbir Kapoor: వివాదంలో రణ్‌బీర్ కపూర్.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు
ఆల్రెడీ రమా రాజమౌళితో కలిసి జక్కన్న తన కొత్త సినిమాలో పాత్రలకు కావాల్సిన కాస్ట్యూమ్ డిజైన్ వర్క్మ మొదలు పెట్టాడు. అంటే కథ, కథనం, పాత్రలు ఇవన్నీ డిసైడ్ అయితేనే ఆపాత్రలకు కావాల్సిన బట్టలని డిజైన్ చేస్తారు. కాబట్టి స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్టే అనుకోవాల్సి వస్తోంది. అదే నిజమని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ఎవరు, మహేశ్ తోపాటు మిగతానటులకి ఎవర్ని తీసుకోవాలి అన్న చర్చ జరుగుతోంది. 6 నెలలు కేవలం వర్క్ షాపులకోసం కేటాయిస్తున్నారంటే, వాటికి కూడా డేట్లు ఇవ్వగలిగే నటుల్నే తీసుకోవాలి. ఆ తతంగమే మొదలైంది.
మ్యూజికల్ సెషన్స్ కూడా కీరవాణితో షురూ చేశాడు రాజమౌళి. ఇక మహేశ్ విషయానికొస్తే, జనవరి 20నుంచి 30 వరకు కథ చర్చలు, పాత్ర మీద క్లాసులు, ఆతర్వాత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 3 నెలలు ఫైట్లు నేర్చుకుంటూనే కండలు పెంచే వర్కవుట్లతో మహేశ్ కెనడాలో బిజీ కాబోతున్నాడు. జూన్ 20 నుంచి షూటింగ్ షురూ చేయాలనే నిర్ణయం మాత్రం రాజమౌళి తీసేసుకున్నాడట.