Mahesh Babu : మంటెక్కిస్తున్న గుంటూరు కారం.. ఇక రచ్చ రచ్చే..
మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం (Guntur Karam) మంటెక్కుతోంది. దమ్ మసాలా బిర్యానీ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Mahesh Babu and Trivikram's Guntur combo is heating up
మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం (Guntur Karam) మంటెక్కుతోంది. దమ్ మసాలా బిర్యానీ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాటతోనే అదిరిపోయే మాస్ ట్రీట్ ను గురూజీ రెడీ చేస్తున్నాడని తెలిసి.. పండగ చేసుకుంటున్నారు. తమన్ ట్యూన్‌తో పాటు సాంగ్‌లో మహేష్ బాబు మాస్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. దీంతో.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్ (Trivikram).
Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. అదిరిన దీపావళి వేడుకలు
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్‌కి రెడీ అవుతోందట. క్లైమాక్స్ కోసం దాదాపు 5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారట. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ అదిరిపోయే యాక్షన్ బ్లాక్‌ని డిజైన్ చేసాడట. దీంతో.. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ సెకండ్ వీక్ వరకు కంప్లీట్ అవనుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై ఫోకస్ చేయనున్నాడు మాటల మాంత్రికుడు.
మహేష్ బాబు వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేసి.. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఫుల్ ఫ్లెడ్జ్‌గా రంగంలోకి దిగనున్నాడు. ఇప్పటికే జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నాడు సూపర్ స్టార్. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. డిసెంబర్‌లో స్క్రిప్టు లాక్ చేసి.. వచ్చే సమ్మర్‌లో ఎస్ఎస్ఎంబీ 29ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయితే రెండు, మూడేళ్లు లాక్ అవనున్నాడు మహేష్ బాబు. మరి గుంటూరు కారం ఎస్‌ఎస్ఎంబీ 29 (SSMB29) ని ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.