ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో మహేష్ బాబు, వెంకటేష్ కీ రోల్.. ఇదెక్కడి చిత్రంరా స్వామి..!

ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఇప్పట్లో మర్చిపోలేరు. ఆ గెలుపు ఇచ్చిన మత్తు అలాంటిది మరి. ఎందుకంటే పుష్కర కాలం దీనికోసం వేచి చూశారు క్రికెట్ వీరాభిమానులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 03:20 PMLast Updated on: Mar 13, 2025 | 3:20 PM

Mahesh Babu And Venkatesh Played A Key Role In The Champions Trophy Victory This Is Where The Movie Is From

ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఇప్పట్లో మర్చిపోలేరు. ఆ గెలుపు ఇచ్చిన మత్తు అలాంటిది మరి. ఎందుకంటే పుష్కర కాలం దీనికోసం వేచి చూశారు క్రికెట్ వీరాభిమానులు. మధ్యలో మూడు సార్లు వరల్డ్ కప్ అందినట్టే అందించే చేజారిపోయింది.. 2023 వన్డే వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా చేతిలో చివరి అడుగులో బోల్తా పడింది మన టీం. దాన్ని మర్చిపోవడానికి అభిమానులకు చాలా సమయం పట్టింది. ఇక గత చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ ముంగట అనుకోకుండా చతికిల పడింది భారత్. ఎన్ని ఎదురు దెబ్బల తర్వాత వచ్చిన విజయం కావడంతో ఛాంపియన్ ట్రోఫీ గెలుపును ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. పైగా బోనస్ కింద గతేడాది T20 వరల్డ్ కప్ కూడా గెలిచారు మనవాళ్లు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ఈ విజయం వెనక వెంకటేష్, మహేష్ బాబు ఏం చేశారు అనేకదా మీ అనుమానం..!

అసలు ఛాంపియన్స్ ట్రోఫీకి వెంకీ, మహేష్ కు ఏంటి సంబంధం అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ అలా ఉన్నాయి మరి. అయినా మీమ్స్ కు లాజిక్ తో పని ఏముంది మ్యాటర్ ఉంటే చాలు.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇదే చేశారు మీమర్స్. ఎప్పుడో 2013లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు టీమిండియా. మళ్లీ ఎన్ని సంవత్సరాలకు రోహిత్ కెప్టెన్సీలో ఇది సాధ్యపడింది. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంవత్సరం 2013.. ఆ సంవత్సరం సంక్రాంతి విడుదలైన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. అందులో హీరోలు వెంకటేష్, మహేష్ బాబు..! మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. అంటే పుష్కరకాలం తర్వాత అన్నమాట.. సరిగ్గా ఈ సినిమా మళ్లీ విడుదలైన సమయంలోనే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.

దాంతో ఇదే లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మహేష్, వెంకటేష్ అభిమానులు. ఏం టైమింగ్ గురు.. అప్పుడు చిన్నోడు పెద్దోడు వచ్చారు ఇండియాకు కప్పు వచ్చింది.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిన్నోడు పెద్దోడు వచ్చారు.. టీమిండియాకు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది.. ఇది కదా లాజిక్ అంటే అంటున్నారు. వినడానికి సిల్లిగా అనిపించినా నవ్వుకోడానికి బాగానే ఉంది కదా. అందుకే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడం వెనక చిన్నోడు పెద్దోడు హస్తం కూడా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. అందుకే చెప్తున్నాను కొన్నిసార్లు లాజిక్స్ లేకున్నా జస్ట్ చిన్న మ్యాటర్ ఉంటే చాలు. ఇదిగో ఇలాంటి అదిరిపోయే మీమ్స్ మనకు దర్శనమిస్తాయి.