Jai Hanuman: ఆ లెక్క వేరే.. రాముడిగా మహేష్.. అదిరిన ప్రశాంత్ వర్మ ప్లానింగ్
హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు.
Jai Hanuman: చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా హనుమాన్. సంక్రాంతి బరిలో అన్ని సినిమాలను నెట్టేసి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు. సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసాడు.
AYODHYA TO TIRUMALA: బాల రాముడికి వెంకన్న సాయం.. తిరుమల రద్దీపై అయోధ్య ట్రస్ట్ స్టడీ
ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. పెద్ద కథ, భారీ కాన్వాస్, అగ్రశ్రేణి నటులు, సాంకేతిక ప్రమాణాలతో ఇది మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించనుంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఈ సినిమాలో శ్రీరామ్, హనుమాన్ పాత్రల్లో బడా స్టార్స్ నటిస్తారని ఇండస్ట్రీ బజ్. ఈ పాత్రల్లో ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. శ్రీరామ్ పాత్రలో తన నంబర్ 1 స్టార్ నటిస్తారు అని హామీ ఇచ్చాడు. “శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు నటించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను.
మరికొందరు లాగానే, మహేష్ బాబుని శ్రీరాముడిగా చూడటానికి మా ఆఫీసులో కొన్ని ఎడిట్‌లు కూడా చేసాము. అయితే అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం’’ అని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక ఆసక్తి కలిగిస్తోంది. ఎవరు ఏ పాత్రలో నటిస్తారు అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. ఈ సీక్వెల్‌లో తేజ సజ్జా మళ్లీ హనుమంతుని పాత్రలో కనిపించనున్నాడు.