MAHESH BABU: రాజమౌళికి మహేశ్ స్పెషల్ రిక్వెస్ట్.. త్రీ మంత్స్ టైమ్ ప్లీజ్
జక్కన్నతో మూవీ అంటే ఆషామాషీ కాదు. మూవీ కంప్లీట్ అవ్వడానికి మూడేళ్లైనా టైమ్ పడుతుంది. గుంటూరు కారం లాంటి ప్లాప్ టాక్‌ను నెత్తిన మోస్తూ.. మూడేళ్ల వరకు బాబును స్క్రీన్ మీద చూడకుండా ఉండడమంటే ఫ్యాన్స్‌కు సాధ్యమయ్యే పని కాదు. దీంతో.. కేవలం ఒకే సినిమాకు 3 ఏళ్లు అంటే కష్టం అని మహేష్ ఆలోచిస్తున్నాడట.
MAHESH BABU: గుంటూరు కారం డిజాస్టర్‌తో ఫుల్ డిజప్పాయింట్‌మెంట్‌లో ఉన్నాడు మహేశ్. ఫ్యాన్స్ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సో.. మహేశ్, ఆయన ఫ్యాన్స్ ఆశలు అన్నీ ఇక రాజమౌళి నెక్స్ట్ మూవీపైనే ఉన్నాయి. అయితే.. జక్కన్నతో మూవీ అంటే ఆషామాషీ కాదు. మూవీ కంప్లీట్ అవ్వడానికి మూడేళ్లైనా టైమ్ పడుతుంది. గుంటూరు కారం లాంటి ప్లాప్ టాక్‌ను నెత్తిన మోస్తూ.. మూడేళ్ల వరకు బాబును స్క్రీన్ మీద చూడకుండా ఉండడమంటే ఫ్యాన్స్‌కు సాధ్యమయ్యే పని కాదు. దీంతో.. కేవలం ఒకే సినిమాకు 3 ఏళ్లు అంటే కష్టం అని మహేష్ ఆలోచిస్తున్నాడట. ఏడాదికి 6 నుంచి 7 నెలలు రాజమౌళి సినిమాకు, మరో నెల రెండు నెలలు వెకేషన్, మరో 3 నెలలు ఇంకో సినిమా చేసేలా రాజమౌళితో చర్చలు జర్పుతున్నాడట మహేష్.
GUNTUR KAARAM: గురూజీ ఎక్కడ..? త్రివిక్రమ్ లేకుండా గుంటూరు కారం సెలబ్రేషన్స్
తన సినిమాల విషయంలో యమ స్ట్రిక్ట్‌గా ఉండే జక్కన్న దీనికి ఒప్పుకుంటాడా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్‌గా మారింది. రాజమౌళి సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. ఆయన తనతో సినిమా చేసే హీరోలకు కండీషన్స్ పెడతారు. లుక్ బయటకు రాకూడదు. ఎక్కువగా ఈవెంట్స్‌కు హాజరు కాకూడదు. తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ చాలా ఉంటాయి. అందుకే.. రాజమౌళి సినిమా అంటే సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరు వారి బల్క్ డేట్స్ ఇవ్వాల్సిందే. అన్ని సినిమాల్లాగా కొద్దిరోజులు ఇక్కడ, మరికొద్ది రోజులు అక్కడ పనిచేస్తానంటే కుదరదు. బాహుబలి ప్రభాస్ అయినా, ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ అయినా సినిమా కోసం ముందు నుంచే ఒళ్లు వంచి కష్టపడ్డారు. ఇప్పుడు మహేష్ విషయంలోనూ రాజమౌళి అండ్ టీమ్ ముందు నుంచే స్కెచ్ సిద్ధం చేస్తోంది. అయితే.. ఇన్ని టఫ్ కండిషన్స్ పెట్టినప్పటికీ రాజమౌళి మూవీలో పని చేసే హీరోలకు వచ్చే క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒకే ఒక్క మూవీతో వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిపోతారు. మహేష్‌తో రాజమౌళి చేస్తున్న సినిమాకు కూడా కనీసం రెండు, మూడేళ్లు టైం తీసుకునేలా ఉన్నాడు.
ఈ సినిమాను కూడా రాజమౌళి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట. దీంతో.. ఏడాదికి మూడు నెలలు వేరే సినిమాలు చేసుకునేలా ఛాన్స్ ఇమ్మంటూ మహేశ్ రాజమౌళితో చర్చలు నడుపుతున్నాడట. అందుకు జక్కన్న ఓకే అంటే ఈ 3 ఏళ్లలో మహేష్ కనీసం రెండు సినిమాలైనా చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎలాగు రాజమౌళి సినిమా 2027లో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది మహేశ్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి రేంజ్ హాలీవుడ్‌కి చేరింది. కామెరూన్ వంటి వారు ఆయన సినిమాలను అప్రిషియేట్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందుకనే మహేశ్ 29వ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా చేయటానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ రిక్వస్ట్‌కు జక్కన్న ఓకే చెప్తారా అన్నది బిగ్ క్వశ్చన్‌గా మారింది. మరి SSMB 29 నెక్స్ట్ అఫీషియల్ అప్డేట్ ఏంటి..? మహేశ్ రిక్వెస్ట్‌కు రాజమౌళి ఓకే చెప్తారా లేదా..? అన్నదానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.