Mahesh Babu: మహేశ్ బాబు విషయంలో దర్శకులంతా ఫెయిల్.. తప్పంతా వాళ్లదే..!
హాలీవుడ్ హీరో రేంజ్‌లో మహేశ్ తన కొత్త లుక్స్‌తో ఓ యాడ్‌లో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. అదేంటో మహేశ్ బాబు ఏ యాడ్ చేసినా హాలీవుడ్ హీరో రేంజ్‌లో కనిపిస్తాడు. అదే సినిమాల్లోకొచ్చే సరికి ఆ రేంజ్ మెరుపులుండవు. కారణం దర్శకుడి చేతకాని తనమా, మేకప్, సినిమాటోగ్రాఫర్ ఫెయిల్యూరా..?

Mahesh Babu: మహేశ్ బాబు మరింత సన్నబడి, డెనిమ్ జీన్స్ షర్ట్‌తో కూలింగ్ గ్లాస్ లుక్స్‌తో పాతికేళ్ల కుర్రాడిగా కనిపించాడు. ఇప్పుడంతా షాక్. ఇది త్రివిక్రమ్ మూవీ గుంటూరు కారంలో మరో పాత్రకోసం మహేశ్ వేసే గెటప్ అన్నారు. కానీ అక్కడ అంత సీన్ లేదు.
హాలీవుడ్ హీరో రేంజ్‌లో మహేశ్ తన కొత్త లుక్స్‌తో ఓ యాడ్‌లో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. అదేంటో మహేశ్ బాబు ఏ యాడ్ చేసినా హాలీవుడ్ హీరో రేంజ్‌లో కనిపిస్తాడు. అదే సినిమాల్లోకొచ్చే సరికి ఆ రేంజ్ మెరుపులుండవు. కారణం దర్శకుడి చేతకాని తనమా, మేకప్, సినిమాటోగ్రాఫర్ ఫెయిల్యూరా..? నిజానికి మహేశ్ బాబుకి మాసిన బట్టలేసినా ఖతర్నాక్ లుక్‌తో షాక్ ఇస్తాడు. అలా తన న్యాచురల్ బ్యూటీతో మహేశ్ సినిమాలో అందంగా కనిపించటమే కాని, తనని మరింత అందంగా చూపించటంలో ఇప్పటి వరకున్నదర్శకులంతా ఫెయిల్ అయ్యారనే అనుకోవాలి. పూరీ ఒక్కడే పోకిరితో మహేశ్ లుక్స్ చాలా బాగా మార్చాడు కాని, అది కూడా సరిపోదు.
ఒక్కసారి మహేశ్ యాడ్స్ చూస్తే ఆరేంజ్‌లో ఎందుకు సినిమాల్లో తనని చూపించలేకపోతున్నారు దర్శకులనేది అర్ధమౌతుంది. అక్కడే దర్శకుల పనితనం, చేతకాని తనంలా కనిపిస్తోందనే కామెంట్స్ ఉన్నాయి. ఇలాంటి డిస్కర్షన్ చాలా సార్లు వచ్చినా.. మహేశ్ బాబు మతిపోగొట్టేలా యాడ్ కోసం తన కొత్తలుక్‌లో కిక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సినిమాల్లో మహేశ్ లుక్, యాడ్స్‌లో మహేశ్ లుక్.. ఏది బెస్ట్ అనే చర్చ పెరిగిందిప్పుడు.